వయసులో ఉన్నప్పుడు డబ్బు సమస్య లేనప్పటికీ, వృద్ధాప్యంలో దాని అవసరం ఎంతో ఉంటుంది. కావున ఇప్పటినుంచే భవిష్యత్ కోసం మంచి ఆర్థిక ప్రణాళిక అలవరచుకోవడం ఉత్తమం. వయసు పైబడినపుడు నెల నెలా కొంత మొత్తంలో మనకు డబ్బు అందుతుంది అంటే ఎలాంటి సమస్యలు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించవచ్చు. అలాంటి ఉత్తమమైన పథకాన్ని భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి అందిస్తోంది. ఆ పథకం పేరు.. సరళ్ పెన్షన్ యోజన. ఈ పాలసీలో చేరాలనుకునేవారు ప్రీమియం మొత్తాన్ని ఒకేసారి చెల్లించాసి ఉంటుంది. ఆపై నెల నెల కొంత మొత్తం పెన్షన్ రాబడి ఉంటుంది.
సరళ్ పెన్షన్ యోజన అనేది సింగిల్ ప్రీమియం పెన్షన్ ప్లాన్. అంటే జీవితంలో ఒకే ఒకసారి ప్రీమియం చెల్లించి పాలసీ తీసుకున్నారంటేనే మీరు నెల నెలా కొంత మొత్తంలో పెన్షన్ పొందుతారని అర్థం. అయితే, ఈ పాలసీని ఇతరులకు మార్చొద్దు. పెన్షనర్ జీవించి ఉన్నంత వరకు అతడికి పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ మరణిస్తే బేస్ ప్రీమియం నామినీకి చెల్లిస్తారు. ఇందులో జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇది భార్యాభర్తలిద్దరికీ కవరేజీ కల్పిస్తుంది. వారు తమ జీవిత కాలం అంతా పెన్షన్ పొందుతారు. ఒకవేళ వారిలో ఒకరు మరణించినా.. మిగతా వారి జీవిత భాగస్వామికి పెన్షన్ లభిస్తుంది. భర్త మరణిస్తే, బేస్ ప్రీమియం తన భార్య లేదా నామినీకి చెల్లిస్తారు.
40 ఏండ్ల నుంచి 80 ఏండ్ల వరకు ఎవరైనా ఈ పాలసీలో చేరొచ్చు. పాలసీలో చేరిన ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా సరెండర్ చేయొచ్చు. మీకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి కూడా ఈ పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ ప్రతి నెలా పెన్షన్ పొందాలని మీరు కోరుకుంటే కనీసం రూ.1000 పెన్షన్ లభిస్తుంది. అదే కనీస పెన్షన్ రూ.12 వేల కావాలనుకుంటే సింగిల్ ప్రీమియం మొత్తంగా ఒకేసారి రూ.10 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రతి ఏటా రూ.50,250 పెన్షన్ పొందుతారు. అలాగే ఈ పథకంలో చేరిన కొంతకాలానికి మధ్యలో వైదొలిగే వీలూ కూడా ఉటుంది. యాన్యుటీ తీసుకున్న ఆరు నెలల నుంచి పాలసీదారుడు లేదా అతడిపై ఆధారపడిన వారు తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పుడు.. పాలసీ మొత్తాన్ని తీసుకోవచ్చు. అలాగే, ఈ పథకంలో ఆరు నెలల తర్వాత రుణం సదుపాయం తీసుకునే వీలూ కూడా ఉంది.