మధ్యతరగతి ప్రజలు లక్షలకు.. లక్షలు ఒక్కరోజులో సంపాదించడం చాలా కష్టం. రూపాయి.. రూపాయి.. పోగేసినా, రేపొద్దున ఏ కష్టం వస్తుందో తెలియదు. దేనికి ఖర్చువుతోందో తెలియదు. కనుక భవిష్యత్ అవసరాల కోసం ఏదేని పాలసీలను లేదా పొదుపు పథకాలను ఎంచుకోవడం ఉత్తమం. అలాంటి అద్భుతమైన ప్రయోజనాలు అందించే పథకాలు, పాలసీలు ఎన్నో ఉన్నాయి. అయితే అందులో ఏది మంచిది, మనకు ఏది సరైనది ఎంచుకోవటమే ముఖ్యం. అందులోనూ.. ఎలాంటి టెన్షన్, రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఎల్ఐసీ పాలసీలు మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.
దేశీయ బీమా సంస్థ ఎల్‌ఐసీ అందిస్తోన్న ‘ఎల్‌ఐసీ న్యూఎండోమెంట్ ప్లాన్‘ అనేది మంచి ప్రయోజనాలు అందిస్తోంది. పాలసీ మధ్యలో రుణ సదుపాయం, ప్రీమియంపై డిస్కౌంట్, మెచ్యూరిటీ ముగిశాక రాబడితో పాటు బోనస్.. ఇలా బోలెడు ప్రయోజనాలున్నాయి. ఇందులో రోజుకు రూ.71 పొదుపు చేస్తూ పోతే.. మెచ్యూరిటీ నాటికి రూ.48 లక్షలు మీ చేతికందుతాయి. అదెలా అన్నది ఇప్పుడు చూద్దాం.. న్యూఎండోమెంట్ ప్లాన్ అనేది నాన్-లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. దీనిని పెద్దలతో పాటు పిల్లలకు తీసుకోవచ్చు. 8 నుంచి 55 సంవత్సరాల వయసు మధ్యకలిగిన వారు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులు. కనీస సమ్ అష్యూర్డ్ అమౌంట్ రూ.1 లక్షకు తగ్గకుండా చూసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు. మీ వార్షిక ఆదాయాన్ని బట్టి ఎంచుకోవచ్చు.
వయసును బట్టి పాలసీ కాల పరిమితిని కనిష్టంగా12 ఏళ్లు, గరిష్ఠంగా 35 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. ఈ పాలసీయొక్క అత్యధిక మెచ్యూరిటీ కాల పరిమితి 75 సంవత్సరాలు, అంటే.. 75 సంవత్సరాలలోపు పాలసీ ముగిసేవిధంగా కాలపరిమితిని ఎంచుకోవాలి. పాలసీదారుడు కనీసం 2 సంవత్సరాలు ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి ప్రీమియం చెల్లిస్తే, రుణ సదుపాయం కూడా ఉంటుంది. అలాగే, పాలసీ ప్రీమియంను ప్రతినెల, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు. 6 నెలలకు, ఏడాదికోసారి చెల్లించే ప్రీమియం అమౌంట్ పై కొద్ది మొత్తంలో డిస్కౌంట్ ప్రాయోజనాలు కూడా పొందవచ్చు.
ఉదాహరణకు…18 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి 35 సంవత్సరాల కాలపరిమితితో రూ.10 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ ఉండేలా పాలసీ తీసుకున్నాడనుకుందాం.. ఇతడు రోజుకు రూ.71 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. అంటే.. నెలకు రూ.2130 లేదా ఏడాదికి రూ.25,962 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ పోతే 35 గడిచాక రూ.48.40 లక్షలు అతని చేతికి అందుతాయి. ఉద్యోగం చేస్తున్నా లేదా బిజినెస్ చేస్తున్నా.. భవిష్యత్ అవసరాల కోసం ఎంతో కొంత పొదుపు చేసుకోవాలనుకునేవారికి ఈ పాలసీ ప్రయోజకరమే అని చెప్పాలి.
LIC’s New Endowment Plan is a perfect combination of Insurance & Savings!
Click for details https://t.co/jQPvKxFRpm pic.twitter.com/EMvfsDs2a5— LIC India Forever (@LICIndiaForever) March 29, 2017