వివాహం చేసుకున్న తర్వాత కంటే కూడా.. పిల్లలు పుట్టాక మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు చాలా మంది. అప్పటి వరకు ఎలా ఉన్నా.. పిల్లలు పుట్టిన క్షణం నుంచే వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. తమకు ఉన్నంతలో పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇక పిల్లలు పెరుగుతున్న కొద్ది వచ్చే వారి అవసరాలను తీర్చడం కోసం పలు మార్గాల్లో డబ్బును పొదుపు చేస్తారు. అయితే ఇలా పొదుపు చేసే వారు సెక్యూరిటీ గురించి ఎక్కువగా ఆలోచించాలి. సదరు స్కీమ్‌ల భద్రత, వాటి కొనసాగింపు తదితర వాటి గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడే పెట్టుబడులు పెట్టాలి.
ఈ నేపథ్యంలో.. పెట్టుబడులకు సురక్షితమైన మార్గంగా నిలుస్తోంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ). చిన్నారులు మొదలు.. వృద్ధులు ఇలా అన్ని రకాల వయసుల వారికి తగినటువంటి పథకాలను తీసుకొస్తుంది ఎల్‌ఐసీ. వీటిల్లో పెట్టుబడులు పెడితే సురక్షితంగా ఉండటమే కాక.. తప్పకుండా డబ్బు చేతికి అందుతుందనే భరోసా ఉంటుంది.
ఇక మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి.. రానున్న కాలంలో వారి అవసరాలు తీర్చడం కోసం ఏదైనా పథకంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారా.. అయితే ఎల్‌ఐసీ వారి జీవన్ తరుణ్ పాలసీ.. మీకు అన్ని విధాల సరిపోతుంది. నిత్యం అనేక కొత్త పథకాలను తీసుకువచ్చే ఎల్‌ఐసీ.. తాజాగా పిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించి.. జీవన్ తరుణ్ పాలసీని తీసుకువచ్చింది. మీ పిల్లల భవిష్యత్ అవసరాలు, చదువు, వివాహం వంటి కోసం డబ్బు పొదుపు చేయాలని భావిస్తే.. జీవన్ తరుణ్ పాలసీ మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ పథకం తీసుకోవాలంటే.. మీ పిల్లల వయసు 90 రోజు నుంచి 12 ఏళ్ల మంధ్య ఉండాలి. పిల్లల 25వ ఏట మొత్తం డబ్బు లభిస్తుంది. 25 ఏళ్ల మెచ్యూరిటీ పిరియడ్‌లో మీరు కేవలం 20 ఏళ్లు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో భాగంగా కనిష్టంగా 75 వేల రూపాయల నుంచి ప్లాన్ ప్రారంభం అవుతుంది. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకునే దానికి లిమిట్ లేదు. ఒకవేళ మీరు గనక 12వ ఏట ఈ పథకంలో ప్రవేశించి.. 5 లక్షల హామీని ఎంచుకుంటే.. మీరు రోజుకు 150 చొప్పున ఏడాదికి 54 వేల రూపాయల ఇన్వెస్ట్ చేయాలి.
ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీ తీసుకుంటే.. మీరు చెల్లించే ప్రీమియం మొత్తం దాదాపు రూ.9 లక్షలకు లోపే ఉంటుంది. కానీ మెచ్యూరిటీ సమయంలో మీరు పొందే మొత్తం మాత్రం రూ.25 లక్షలకు పైనే ఉంటుంది. మీ డబ్బుకు ఎలాంటి భయం అవసరం లేదు. పూర్తి రక్షణ ఉంటుంది. అలానే దీనిపై లోన్ పొందే అవకాశం కూడా ఉంది. పాలసీ మెచ్యూరిటీ తర్వాత డబ్బులు తీసుకోవడానికి కూడా కొన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మెచ్యూరిటీ తర్వాత మీరు పాలసీ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. లేదంటే ఏడాదికి నాలుగు విడతలుగా కూడా పాలసీ మొత్తాన్ని పొందవచ్చు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పాలసీ మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇలా 5, 10, 15 ఏళ్ల చొప్పున పాలసీ మొత్తాన్ని పొందుతూ రావొచ్చు.