LIC Jeevan Tarun Plan Full Details In Telugu: బీమా పాలసీలు అనగానే ఉన్నత వర్గాల వారితో పాటు పేదలు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తుకు వచ్చేది లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ). చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికి, అన్ని వయసుల వారి కోసం ఎన్నో రకాల పాలసీలను అందుబాటులోకి తెస్తుంది. ఇక పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రుల కోసం ఎల్‌ఐసీ ఎన్నో అద్భుతమైన పాలసీలను తీసుకొస్తుంది. ఒక్క పాలసీతో ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కోవకు చెందినదే ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీ. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీ అనేది నాన్-లింక్డ్ పాలసీ, పార్టిసిపేటింగ్, ఇండివిజువల్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్ ప్లాన్. ఇందులో పిల్లలు పొదుపు, బీమా రక్షణ రెండింటి ప్రయోజనాన్ని పొందుతారు. ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీలో పెట్టుబడి పెట్టడానికి పిల్లల కనీస వయస్సు 90 రోజుల మధ్య ఉండాలి. అంటే 3 నెలల నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి. ఒక వేళ 3 నెలల వయస్సులో పాలసీ తీసుకుంటే.. అప్పుడు పాలసీ టర్మ్ 22 ఏళ్లు అవుతుంది. ప్రతి రోజు పిల్లలకి 20 ఏళ్లు వచ్చే వరకు దాదాపు రూ. 100 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుది.
ఇది కూడా చదవండి: Shapoorji Pallonji గ్రూప్ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత!
ఇలా సుమారు 20 లక్షల వరకు ఫండ్‌ను క్రియేట్ చేయవచ్చు. ఒక వేళ పిల్లల వయస్సు 10 ఏళ్లు అనుకుంటే.. అప్పుడు పాలసీ టర్మ్ 15 ఏళ్లుగా మారుతుంది. అదే ఒకవేళ పిల్లలకు 12 ఏళ్లు ఉంటే.. అప్పుడు పాలసీ టర్మ్ 13 ఏళ్లు అవుతుంది. పిల్లలకు మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి భారీ మొత్తం లభిస్తుంది. ఈ పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి మీరు వార్షికంగా, ప్రతి మూడు నెలలు, 6 నెలలు లేదా వార్షిక ప్రాతిపదికన ప్రీమియంను ఎంచుకోవచ్చు. నెలవారీగా ప్రీమియం చెల్లింపులు చేయడానికి మీకు 15 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. ఇలా పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే.. 20వ సంవత్సరం నుంచి నుంచి 25 ఏళ్లు వచ్చే వరకు ప్రతి సంవత్సరం కొంత మొత్తం పొందొచ్చు. దీని కోసం మనీ బ్యాక్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ పాలసీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: SBI: కస్టమర్లకు SBI గుడ్‌న్యూస్! సెలవు రోజుల్లోనూ బ్యాంకు సేవలు!