భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్నదే మీ ఆలోచనా..! అయితే, ఇప్పటి నుంచే పొదుపు మార్గాలపై అన్వేషించండి. ఎటువంటి ఆర్థిక కష్టమొచ్చినా/ లక్షల రూపాయల అవసరమొచ్చినా మీకు ఆసరాగా ఉండేవి.. మీరు పొదుపు చేసిన డబ్బులు మాత్రమే. ఈ విషయాన్ని మరువకుండా వెంటనే పొదుపు చేయడం ఆరభించండి..
మనిషి జీవితం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం.. అనుకొని ప్రమాదాలు ఎప్పుడైనా మనల్ని కాలగర్భంలో కలిపేయొచ్చు. లేదంటే కరోనా వంటి మహమ్మారి మరొకసారి అడ్డుపడొచ్చు. అలాంటి పరిస్థితి ఎదురై ఇంటి పెద్ద దూరమైతే.. ఆ ఇంటిల్లిపాది కష్టాలు వర్ణనాతీతం. ఆర్థికంగా భారమైతే.. ఆ మరణం వారిని మరింత మానసికంగా కృంగదీస్తుంది. అలాంటి కష్టాలు మీ కుటుంబానికి ఎదురుకాకూడదు అంటే.. సరైన రాబడి అందించే జీవిత బీమా తీసుకోవాలి. దేశీయ బీమా సంస్థ ఎల్ఐసీ అలాంటి మంచి జీవిత భీమా పాలసీని అందిస్తోంది. ఈ పాలసీ ద్వారా అతి తక్కువ ప్రీమియం మొత్తంతో భారీ ప్రయోజనాలు పొందవచ్చు. రోజుకు రూ.55 పొదుపు చేయగలరు అనుకుంటే.. రూ.10 లక్షలు మీ చేతికి అందుతాయి.
‘ఎల్ఐసీ జీవన్ అమర్ ప్లాన్’ ఇదొక నాన్ లింక్డ్, ఇండివిజ్యువల్, ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్. పాలసీ కొనసాగుతున్న సమయంలో పాలసీదారులు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. 10 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల వరకు గడువును ఎంచుకోవచ్చు. కనీస సమ్ అష్యూర్డ్ రూ.2,00,000 కాగా, గరిష్టం పరిమితి ఏమీ లేదు. అంటే.. రూ.2 లక్షల నుంచి మొదలుకొని ఎంతైనా పొందడానికి పాలసీ చేసుకోవచ్చు. ఈ పాలసీ వల్ల ముఖ్య ప్రయోజనం ఏంటంటే.. తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అందులోనూ ప్రీమియం చెల్లింపుపై డిస్కౌంట్లు పొందే అవకాశం ఉన్నందున ప్రీమియం కూడా తగ్గతుంది. అలాగే.. అందే బీమా మొత్తంపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు.
40 ఏళ్ల వయసున్న వ్యక్తి 20 ఏళ్ల గడువుతో రూ.10 లక్షల మొత్తానికి జీవన్ అమర్ పాలసీ తీసుకున్నారనుకుందాం. అతని వయస్సు కొంచెం ఎక్కువ కావున ఏటా రూ.20 వేల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ.55 అతడు పక్కకు పెట్టాలి. ఇలా ప్రీమియం చెల్లిస్తున్న సమయంలో పాలసీదారు మరణిస్తే నామినీ ఖాతాలో రూ.10 లక్షలు జమ అవుతాయి. లేదంటే.. 20 ఏళ్ల గడువు పూర్తయ్యాక పాలసీదారుడు రూ.10 లక్షలను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ప్రీమియం మొత్తం పాలసీదారుల వయస్సుపై ఆధారపడి ఉంటుంది. వయస్సు తక్కువయితే.. ప్రీమియం తక్కువ గానూ, వయస్సు ఎక్కువయితే,, ప్రీమియం ఎక్కువ గానూ ఉంటుంది. ఈ పాలసీపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.