సాఫ్ట్ వేర్ నుండి వివిధ రంగాలకు చెందిన అనేక మంది ఉద్యోగాలను కోల్పోయారు. పెద్ద సంస్థల సైతం ఉద్యోగులకు షాక్‌నిస్తున్నాయి. జాబ్ సెక్యూరిటీ కూడా లేకపోవడంతో మరో ప్రత్యామ్నాయ మార్గం వైపు అన్వేషిస్తున్నారు నేటి యువత.
ప్రస్తుతం దేశంలో రెసిషన్ టైమ్ నడుస్తుంది. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. సాఫ్ట్ వేర్ నుండి వివిధ రంగాలకు చెందిన అనేక మంది ఉద్యోగాలను కోల్పోయారు. పెద్ద సంస్థల సైతం ఉద్యోగులకు షాక్‌నిస్తున్నాయి. జాబ్ సెక్యూరిటీ కూడా లేకపోవడంతో మరో ప్రత్యామ్నాయ మార్గం వైపు అన్వేషిస్తున్నారు నేటి యువత. అలా వ్యాపార రంగంతో పాటు తమకు ఇష్టమైన వ్యాపకాల వైపు వెళుతూ.. ఆదాయ వనరులను సమాకూర్చుకుంటున్నారు. కొంత మంది వ్యవసాయ రంగంలో.. సాంకేతికను వినియోగించుకుని కొత్త పంటలు పండిస్తూ ఆదాయం సంపాదిస్తుంటే.. మరికొందరు పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ వైపు మొగ్గుచూపుతున్నారు.
అలాగే వినూత్నమైన, డిమాండ్ ఉన్న వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత. కోడిని, ఈము పక్షుల గుడ్లకు, మాంసానికి ఎంత డిమాండ్ ఉందో.. అలాగే కౌజు పిట్టల (క్వయిల్) గుడ్లకు, ఆ మాంసానికి కూడా ప్రియులున్నారు. అయితే భారత్‌లో లభించే కౌజు పిట్టలను పెంచడం, చంపడం నిషిద్ధం. దీంతో విదేశాల నుండి దిగుమతి చేసి పెంచుతున్నారు. అంతే కాకుండా ఒక కోడిని పెంచే స్థలంలో 8 కౌజు పిట్టలను పెంచవచ్చు. దీంతో ఇది ఇప్పుడు నిరుద్యోగులకు లాభదాయకమైన వ్యాపారంగా మారిపోయింది. ఒక్కో కౌజు పిట్ట సంవత్సరానికి 250 నుండి 280 వరకు గుడ్లు పెడుతుంది. అంతేకాకుండా మగ పక్షి కన్నా.. ఆడ కౌజు పిట్ట బరువు కూడా ఎక్కువ తూగుతుంది. వీటిని అమ్మితే నెలకు రూ. లక్షకు పైగా ఆదాయం వస్తుంది. అందుకు ఇప్పుడు ఈ బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్నారు కొంత మంది.
వీటి పెంపకానికి ఖర్చు తక్కువతో పాటు ఆదాయం ఎక్కువగా లభిస్తుంది. వీటిని పెంచేందుకు భారీ స్థలం కూడా అవసరం లేదు. కొనుగోలు చేసేటప్పుడు పిల్లగా రూ. 9 నుండి రూ. 10 లకే లభిస్తుంది. ఐదు వారాల్లోనే పిట్ట బరువు పెరుగుతుంది, గుడ్లను కూడా ఇస్తుంది. ఒక్కో పిట్టను పెంచడానికి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. నెల రోజుల తర్వాత వీటిని అమ్మితే.. రూ. 45 నుండి రూ. 60 రూపాయలు వస్తున్నాయి. అలాగే ఒక్కో గుడ్డు ధర రూ. 3 నుండి 5 రూపాయలకు వరకు పలుకుతుంది. వీటి గుడ్లు, మాంసం దేశంలో భారీ డిమాండ్ ఉంది. గుడ్లలో కొవ్వు తక్కువగా ఉండటంతో పాటు ప్రోటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మాంసం చాలా రుచిగా ఉండటంతో వీటిని తినేందుకు ప్రత్యేకమైన ఆహార ప్రియులున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్ లో వీటిని అమ్మి, లాభాలను ఖాతాల్లో వేసుకుంటున్నారు.