తాము అందించే సేవలకు సంబంధించి బ్యాంక్‌లు ఛార్జీలు వసూలు చేస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. ఇక తాజాగా ఓ బ్యాంక్, డెబిట్ కార్డు, మినిమం బ్యాలెన్స్ మెయిన్‌టెన్స్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆవివారలు..
నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి బ్యాంకులు కొత్త నియమాలను అమల్లోకి తీసుకువచ్చాయి. మరీ ముఖ్యంగా బ్యాంకులు అందించే పలు సేవలపై విధించే ఛార్జీలను భారీగా పెంచనున్నాయి. ఈ క్రమంలోనే ప్రైవేట్ బ్యాంకింగ్‌లో అగ్రగామిగా కొనసాగుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. డెబిట్ కార్డు ఛార్జీలను పెంచడమే కాక.. అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ మెయిన్‌టేన్ చేయకపోతే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు కస్టమర్లకు మెయిల్ చేసింది కోటక్ మహీంద్రా బ్యాంక్. పెంచిన ఛార్జీలు 2023, మే 22 నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది.
ఈ ఏడాది మే 22, 2023 నుంచి డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలు పెంచాలనుకుంటున్నాం. ప్రసుత్తం ఈ ఛార్జీలు 199 ప్లస్ జీఎస్‌టీ ఉండగా.. దానిని 259+జీఎస్‌టీ చేయాలనుకుంటున్నాం అని మెయిల్‌లో చెప్పుకొచ్చింది. అంటే గతంలో 200 రూపాయలు ఉన్న డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలను 260 రూపాయలకు పెంచింది. అలానే అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే.. భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది అని హెచ్చరించింది.
కోటక్ మహీంద్ర బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌తో పాటు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వంటి సేవలను అందిస్తోంది. ఇక గతేడాది అనగా 2022, జూన్ 1 నుంచి సేవింగ్స్ అకౌంట్, సాలరీ విధించిన ఛార్జీలు ఇలా ఉన్నాయి. దీని ప్రకారం కోటక్ మహీంద్రా సేవింగ్స్ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకుంటే.. 6 శాతం లేదా గరిష్టంగా ప్రొడక్ట్ వేరియంట్‌పై రూ.500/600 వరకు ఛార్జీ వసూలు చేస్తోంది. ఏదైనా నాన్ ఫైనాన్షియల్ రీజన్స్‌తో చెక్ ఇష్యూ, రిటర్న్స్‌కు సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే రూ. 50 ఛార్జీ వసూలు చేస్తోంది.
ఇక డెబిట్ కార్డు పొగొట్టుకున్నా, లేదా దొంగిలించబడినా.. అప్పుడు కార్డు రీప్లేస్‌మెంట్ కోసం 200 రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక బ్యాంక్ అకౌంట్‌లో సరిపడ బ్యాలెన్స్ లేక.. ఏటీఎం ట్రాన్సాక్షన్ డిక్లైన్ అయితే.. ప్రతి ట్రాన్సాక్షన్ మీద 25 రూపాయల చొప్పున ఫైన్ కట్టాలి. ఇక కోటక్ బ్యాంక్ తీసుకువచ్చిన తాజా రూల్స్‌తో కస్ట్‌మర్ జేబుకు భారీగా చిల్లు పడే అవకాశం ఉంది. బ్యాంక్ సర్వీస్ ఛార్జీల పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.