డబ్బు చాలా విచిత్రమైనది. ఇది కొంత మందికి చేతుల్లోకి రాకుండా ఏడిపిస్తే.., మరి కొంత మందికి చేతుల్లో నిలవక ఏడిపిస్తుంది. జేబులో డబ్బు ఉంటే మహారాజుల్లా ఖర్చు పెట్టేసే వీక్ నెస్ మనలో చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు తమ దగ్గర క్యాష్ ఉంచుకోవడం అంత మంచిది కాదు. నిజానికి ఎవరైనా తమ సేవింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్స్ మార్చడం అలవాటు చేసుకోవాలి. కానీ.., ఇప్పుడున్న పరిస్థితిల్లో మంచి రిటర్న్స్ ఇస్తూ.., డిపాజిట్ కి సెక్యూరిటీ ఇచ్చే ప్లాట్ ఫామ్స్ చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. ఈ విషయంలో పోస్టాఫీస్ చాలా బెటర్ ఆప్షన్.
పోస్టాఫీస్ ప్రస్తుతం పెట్టుబడిదారులను ఆకర్షించడానికి సరికొత్త పధకాలను ప్రవేశ పెడుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు “కిసాన్ వికాస్ పత్ర” స్కీమ్ ప్రవేశ పెట్టింది. ఇందులో మనం ఎంత డబ్బైతే పెట్టుబడిగా పెడుతామో.., దానికి డబుల్ అమౌంట్ ని రిటర్న్ గా పొందవచ్చు. ఉదాహరణకి కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.., రెండు లక్షలు రిటర్న్ పొందవచ్చు. 2 లక్షలు పెట్టుబడి పెడితే 4 లక్షలు రిటర్న్ అవుతాయి.
ఇలా మనం 1000 రూపాయల నుండి ఎంత మొత్తంలోనైనా పెట్టుబడిగా పెట్టికోవచ్చు. కానీ.., దీని మొత్తం మెచ్యూరిటీ పీరియడ్ మాత్రం 124 నెలలు. అంటే 10 సంవత్సరాల 4 నెలలు అనమాట. ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌పై 6.9 శాతం వడ్డీ వస్తోంది. బయట వాళ్ళకి అప్పులు ఇచ్చి, అధిక వడ్డీల కోసం ఆశపడి, అసలుకే ఎసరు తెచ్చుకోవడం కన్నా ఇది చాలా మంచి పధకం. కాకుంటే.., ఒక్కసారి అమౌంట్ డిపాజిట్ చేస్తే.., మెచ్యూరిటీ అయ్యే వరకు డబ్బుని పొందలేము. సో.., ఈ ఒక్క విషయంలో మీ ఆర్ధిక పరిస్థితిని ఆలోచించుకుని ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వండి.