ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ బేబీ పౌడర్‌పై నమోదైన వేలాది దావాలను పరిష్కరించాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో కస్టమర్లకు రూ.వందల కోట్ల పరిహారం చెల్లించేందుకు సంస్థ రెడీ అయింది.
యూఎస్ ఫార్మాసూటికల్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ గురించి తెలియని వారుండరు. ఈ సంస్థ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా జాన్సన్ కంపెనీ బేబీ టాల్కమ్ పౌడర్ బాగా ఫేమస్. అయితే ఈ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయనే ఆరోపణలతో అప్పట్లో వేల దావాలు నమోదయ్యాయి. ఏళ్ల తరబడి దాఖలైన వ్యాజ్యాలకు ముగింపు పలకాలని జాన్సన్ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా క్లెయిమ్ చేసిన వారికి దాదాపు 9 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారుగా రూ.740 కోట్లు) పరిహారం చెల్లించేందుకు ప్రతిపాదించింది. తమ టాల్కమ్ పౌడర్ ఉత్పత్తుల మీద వచ్చిన అన్ని క్లెయిమ్‌లను ఈ పరిహారం సమర్థంగా పరిష్కరిస్తుందని జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది.
ఒకవేళ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతిపాదించిన పరిహారాన్ని మెజారిటీ ఫిర్యాదుదారులు, కోర్టు ఆమోదిస్తే మాత్రం అమెరికా చరిత్రలో అతిఎద్ద సెటిల్మెంట్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది. కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు ల్యాబ్ టెస్టుల్లో తేలింది. దీంతో యూఎస్‌లో వేలాది మంది కస్టమర్లు భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టులను ఆశ్రయించారు. గత పదేళ్ల కాలంలో ఆ కంపెనీ బేబీ పౌడర్ అమ్మకాలపై కస్టమర్లు భద్రతా వ్యాజ్యాలను న్యాయస్థానాల్లో దాఖలు చేశారు. ఆస్బెస్టాస్ క్యాన్సర్ కారకంతో కలుషితం అవడం వల్ల జాన్సన్ టాల్కమ్ ఉత్పత్తులు వ్యాధికి కారణమయ్యాయని ఆరోపిస్తూ 38 వేలకు పైచిలుకు వ్యాజ్యాలు యూఎస్ కోర్టుల్లో దాఖలయ్యాయి. జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతిపాదించిన పరిహారానికి కోర్టులు, ఫిర్యాదుదారులు ఒప్పుకుంటారో లేదో చూడాలి.
Johnson and Johnson agrees to pay $9BILLION to settle claims its baby powder caused cancerhttps://t.co/saFW4PqN5u
— Wittgenstein (@backtolife_2023) April 5, 2023