ఈ వార్త జియో యూజర్లకు శుభవార్త వంటిదే. అతి తక్కువ ధరలో 336 రోజులు పాటు అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు అందించే ఒక ప్లాన్ అందుబాటులో ఉంది. అయితే, ఇది జియోఫోన్ యూజర్ల కోసం మాత్రమే వర్తిస్తుంది. రూ.895 ప్లాన్ పై 336 రోజుల పాటు అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ డేటాతో మరియు మరికొన్ని ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జియోఫోన్ యూజర్ల కొరకు మాత్రమే ఈ ప్లాన్ తీసుకొచ్చారు. ఇది 336 రోజుల లాంగ్ వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గానూ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాలు పొందవచ్చు. ఇక డేటా విషయానికొస్తే.. ప్రతి 28 రోజులకు 2జీబీ డేటా చొప్పున 12 నెలలకు 24జీబీహై స్పీడ్ డేటా అందుకుంటారు. అలాగే, నెలకు 50 ఎస్‌ఎంఎస్‌ల చొప్పున 12 నెలలకు600 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. వీటితో పాటు అన్ని జియో యాప్స్ కి యాక్సెస్ ఉచితం. ఇక సాధారణ యూజర్లయితే రూ.2,999 ఎంచుకోవాలి. ఇది 388 రోజుల(365 డేస్ + 23 డేస్) వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది.