దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో డిసెంబర్ 1, 2021లోనే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచేసిన విషయం తెలిసిందే. టెలికాం పోటీదారులైన భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించిన తర్వాత జియో కూడా తమ ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను పెంచింది.
ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను దాదాపు 20 శాతం వరకు సవరించింది. సవరించిన ధరల ప్రకారం యూజర్లపై అధికభారం పడనుంది. నెలవారీ/వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా యాడ్ ఆన్ ప్లాన్‌ల ధరలను కూడా జియో పెంచేసింది. చాలామంది జియో యూజర్లకు పెరిగిన కొత్త ప్రీపెయిడ్ ధరలపై గందరగోళం నెలకొంది. జియో యూజర్లు ఏదైనా రీఛార్జ్ చేయడానికి ముందు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను సరిచూసుకోవాల్సిందిగా కోరింది.
సవరించిన జియో ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు :
అప్పుడు ఇప్పుడు
28 రోజుల వ్యాలిడిటీ : రూ. 199 రూ. 239 (1.5GB) డేటా పర్ డే
28 రోజుల వ్యాలిడిటీ – రూ. 299 (2GB) డేటా పర్ డే
56 రోజుల వ్యాలిడిటీ రూ. 399 రూ. 479 (1.5GB) డేటా పర్ డే
56 రోజుల వ్యాలిడిటీ రూ. 444 రూ. 533 (2GB) డేటా పర్ డే
84 రోజుల వ్యాలిడిటీ రూ. 329 రూ. 399 (6GB) డేటా
84 రోజుల వ్యాలిడిటీ రూ.555 రూ.666 (1.5GB) డేటా పర్ డే
84 రోజుల వ్యాలిడిటీ రూ. 599 రూ.719 (2GB) డేటా పర్ డే
336 రోజుల వ్యాలిడిటీ – రూ. 2545 (1.5GB) డేటా పర్ డే
336 రోజుల వ్యాలిడిటీ రూ. 2,399 రూ. 2,879 (2GB) డేటా పర్ డే
రిలయన్స్ జియో టాప్ అప్ ప్యాక్ ధరలను కూడా సవరించింది. రూ.51 యాడ్ ఆన్ ప్లాన్ ధర రూ.61కి (6GB), రూ.101 ప్యాక్ రూ.121 (12GB) ప్యాక్, రూ.251 నుంచి రూ.301 (50GB) డేటాతో లభించనున్నాయి.