మీరు జియో కష్టమర్లా..! అయితే మీ కోసమే ఈ వార్త. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తూ.. దేశంలోనేఅగ్రగామి సంస్థగా వెలుగొందుతోన్న జియో మరో మరో సంచలన ఆఫర్ ను తీసుకువచ్చింది. వార్షిక రీఛార్జ్ ప్లాన్ పై ఏకంగా 23 రోజుల పాటు ఫ్రీగా అదనపు వ్యాలిడిటీ ప్రయోజనాలు అందించనున్నట్లు ప్రకటించింది. అంటే.. ఈ 23 రోజులు అన్ని రకాల అన్‌లిమిటెడ్ సదుపాయాలు ఉచితమన్నమాట. ఆ వివరాలు..
నెల వారి రీఛార్జులతో ఇబ్బంది పడుతోన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని జియో, వార్షిక ప్లాన్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు యూజర్లు.. ఏదేని నెలలో రీఛార్జ్ చేయడం మర్చిపోతే అవుట్‌గోయింగ్ కాల్‌లు, మెసేజ్‌లు ఆగిపోయేవి. పైగా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా మీ ప్యాక్ వ్యాలిడిటీ ముగిసిపోతుందంటూ రిమైండర్‌లతో విసిగించేవారు. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జియో వార్షిక ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లు నెలవారీ రీఛార్జ్‌లను తగ్గించడమే కాకుండా ఫోన్ కాలింగ్, డేటా వ్యాలిడిటీపై మంచి డీల్, బెనిఫిట్స్ కూడా అందిస్తాయి. అదనంగా, జియో యూజర్ల భవిష్యత్తులో టారిఫ్ పెంపుపై కూడా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఇప్పుడు అసలు విషయమేమిటంటే.. జియో ‘వార్షిక ప్లాన్’ రూ. 2,999తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల పాటు వ్యాలిడిటీ లభించేది. అయితే తాజాగా, జియో.. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న వారికి అదనపు బెనిఫిట్స్ ను ప్రకటించింది. అదనంగా మరో 23 రోజులు వ్యాలిడిటీని పొడిగించనున్నట్లు ప్రకటించింది. అంటే.. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వారికి 388 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ 388 రోజులు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్‌లు, 2.5జీబీ రోజువారీ డేటా ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే, దీనికి అదనంగా.. 75 జీాబీ ఫ్రీ డేటా కూడా లభిస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే.. దాదాపు 13 నెలల వరకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఏడాదిపాటు రీఛార్జ్ బాధలు ఉండకూడదనుకుంటూ ఈ వార్షిక ప్లాన్ ఉత్తమమైనది. ఈ ప్లాన్‌పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.