దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా చలామనీ అవుతున్న రిలయన్స్ జియో తన 5G సేవల విషయంలో కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 5 నుంచి దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 5జీ బీటా ట్రయిల్ సేవల్ని ప్రారంభించిన జియో, ఈ సేవలు ఎంపికచేసిన ఖాతాదారులకు మాత్రమే లభిస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిల్లో మొదలయ్యే తమ 5జీ సర్వీసుల్ని ఉపయోగించుకునేందుకు ‘జియో ట్రూ 5జీ వెల్‌కం ఆఫర్’ పేరుతో కొంతమంది కస్టమర్లను ఆహ్వానాలు పంపుతోంది. ఇలా ఇన్విటేషన్ కోడ్ పొందిన కస్టమర్లు మాత్రమే 5జీ సేవలు పొందగలరు.
జియో 5జీ సేవలు పొందడానికి యూజర్లు వారి ప్రస్తుత సిమ్‌కార్డ్ గానీ, 5జీ హ్యాండ్‌సెట్‌ను మార్చుకోనవసరం లేదని తెలిపిన జియో ఆటోమేటిక్‌గా 5జీ సర్వీసులకు అప్‌గ్రేడ్ అవుతుందని ప్రకటించింది. అలాగే యూజర్లు వారి ప్రస్తుత 4జీ ప్లాన్ ప్రకారమే టారీఫ్ చెల్లిస్తే చాలని, ట్రయిల్ సందర్భంగా 5జీ డాటాకు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని వివరించింది. కాకుంటే.. కనీస రీఛార్జ్ తప్పనిసరంటూ షరతు పెట్టింది.
జియో 5G సేవలు పొందడానికి కస్టమర్లు తమ ప్రస్తుత 4G SIM కార్డ్‌ని అప్‌గ్రేడ్ చేయనవసరం లేదని జియో స్పష్టం చేసినప్పటికీ, కనీస రీఛార్జ్ ప్లాన్ తప్పనిసరంటూప్రకటన చేసింది. రూ.239 లేదా అంతకన్నా పైబడిన ధరల ప్లాన్లను ఎంచుకున్న వారే.. జియో 5G వెల్‌కమ్ ఆఫర్ ప్రయోజనాలను పొందడానికి అర్హులను పేర్కొంది. వీరికి సెకండ్‌కు 1 గిగాబిట్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ 5జీ డాటా లభిస్తుంది. ఈ చర్యతో సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవచ్చన్నది జియో అభిప్రాయం.
Hi Amolakh, all #JioTrue5G customers who are invited for the Jio Welcome Offer, can enjoy UNLIMITED 5G Data with speeds up to 1 Gbps. This will work only if the Jio customer has a valid active base plan of Rs 239 or higher for prepaid and all postpaid users – Sharath
— JioCare (@JioCare) October 7, 2022