నెల నెలా రీఛార్జ్ లతో విసిగిపోతున్నారా! ఇలాంటి బాధలు లేకుండా ఉండాలంటే ఈ ప్లాన్ మీకు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఏడాదిపాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా సర్వీసులు పొందవచ్చు. మొబైల్ ఫోన్ కు ప్రతి నెలా రీఛార్జ్ చేయడం తప్పనిసరి. అలా చేయించకపోతే సర్వీసులు నిలిచిపోతుంటాయి. అయితే ఈ పరిస్థితి తప్పించేందుకు రిలయన్స్ జియో ఏడాది పాటు వ్యాలిడిటీతో ప్లాన్స్ ప్రెవేశపెట్టింది. అయినప్పటికీ.. చాలామంది నెల.. రెండు.. మూడు నెలలు ప్లాన్లను ఎంచుకుంటూ అవే బాధలు పడుతున్నారు.
డబ్బులున్నప్పుడు ఒక్క రూ. 3,000 ఖర్చు పెట్టేశాం అనుకుంటే.. రీఛార్జ్ ల బెంగ లేనట్లే. ఏడాది పాటు వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లను ఎంచుకుంటే.. నెల నెలా రీఛార్జ్ చేయించే పనుండదు. ఒకసారి రీఛార్జ్ చేపిస్తే.. సంవత్సరం పాటు ఎలాంటి రీఛార్జ్ లేకుండానే కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిరాటంకంగా పొందవచ్చు. ఇంతకీ ఈ ప్లాన్ ధర ఎంత? ప్రయోజనాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం..
ఈ ప్లాన్ ధర 2879 రూపాయలు. దీన్ని కనుక ఒకసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం పాటు తిరిగి రీఛార్జ్ చేయించాల్సిన పనిలేదు. ప్లాన్‌లో జియో కస్టమర్లకు చాలా ప్రయోజనాలున్నాయి. యేడాది పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. అలాగే.. రోజుకు 2జీబీ డేటా చొప్పున 365 రోజులు 730జీబీ డేటా పొందవచ్చు. రోజుకు100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. వీటితో పాటు జియో టీవీ యాప్, జియో సినిమాతో పాటు జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.