టెలికాం రంగంలో సంచలనాలకు మారుపేరు.. రిలయన్స్ జియో. ప్రారంభంలో అన్నీ ‘ఫ్రీ’ అంటూ టెలికాం రంగంలో అడుగుపెట్టిన జియో అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది యూజర్లను కొల్లకొట్టింది. కాలానుగుణంగా ఫ్రీ స్కీమ్ ఎత్తివేసి.. టారిప్ ప్లాన్లు తీసుకొచ్చినా.. క్రమంగా ఆ సంస్థ యూజర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. అందుకు కారణం.. జియో తీసుకొచ్చే వినూత్నమైన ఆఫర్లు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా రోజులు మొదలుకొని.. ఏడాది వరకు అన్నాయి రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా, జియో న్యూఇయర్ ఆఫర్ల పేరిట కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. ఆ వివరాలు
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జియో ‘హ్యాపీ న్యూ ఇయర్ 2023’ పేరిట రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇందులో ఒకటి రూ.2023 విలువతో తీసుకురాగా.. మరొకటి ఇప్పటికే ఉన్న రూ.2999 ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసింది. ఇవి ధర పరంగా ఎక్కువుగా ఉన్నప్పటికీ, ఏడాది పాటు మళ్లీ రీఛార్జ్ బాధలు ఉండకూడదు అనుకునేవారికి ప్రయోజనకరం.
2023 సంవత్సరాన్ని తెలియజేసే విధంగా రూ.2023 విలువతో జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 252 రోజులు. ఈ ప్లాన్ కింద రోజుకు 2.5 జీబీ చొప్పున డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో జియో యాప్స్ ఉచితంగా లభిస్తాయి.
జియో ఎప్పటి నుంచో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. కాకుంటే.. కొత్తగా కొన్ని మార్పులు చేశారు. ఏడాది వ్యాలిడిటీకి అదనంగా మరో 23 రోజుల అదనపు వ్యాలిడిటీని, 75జీబీ డేటాను జోడించారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. రోజుకు 2.5జీబీ డేటా చొప్పున మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాల్స్ లభిస్తాయి. లాంగ్‌టర్మ్ ప్లాన్ కోసం చూస్తున్న వారు ఈ రెండు ప్లాన్లను పరిశీలించొచ్చు. ఈ ప్లాన్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.