ప్రముఖ టెలికాం రంగ సంస్థ రిలయన్స్ జియో భారత్ లో 5G సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. జూలైలో జరిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం సంస్థ అత్యధిక ధర వెచ్చించింది. ఈక్రమంలో వేలం ముగిసిన కొన్ని రోజులకు రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడతూ.. తమ కంపెనీ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను 5G సేవలతో జరుపుకోనుందని తెలిపారు. రిలయన్స్ ఇప్పుడు భారతదేశంలోని టాప్ 1,000 నగరాల్లో 5G సేవల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను పూర్తి చేసినట్లు వెల్లడించారు.
మొదటి విడతగా ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, పూణె, చండీగఢ్, బెంగళూరు, అహ్మదాబాద్ మొదలైన వాటితో సహా 22 నగరాలకు 5G సేవలు అందుబాటులోకి వస్తాయి. త్వరలో మరిన్ని నగరాలు ఈ జాబితాలోకి చేర్చబడతాయి. రిలయన్స్ జియో తన వార్షిక నివేదికలో కవరేజ్ ప్లానింగ్ గురించి ఇతర వివరాలను వెల్లడించింది. భారత్ లోని టాప్ 1,000 నగరాల్లో 5G ఏర్పాటుకు ప్రణాళికలు పూర్తి చేసినట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. వినియోగాదారులు, వచ్చే ఆదాయ ఆధారంగా ఈ ప్రణాళిక తయారు చేసినట్లు జియో సంస్థ తెలిపింది. 5G తో పాటు దానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలను కూడా జియో ప్రారంభించనుంది.
కొన్ని మీడియా కథనాల ప్రకారం జియో తన క్లౌడ్ సొల్యూషన్స్ కోసం గూగుల్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నమోదు చేసిందని సమాచారం. మార్చి 2022 చివరి నాటికి, 410.2 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులను జియో కలిగి ఉంది. 700MHz, 800MHz, 1800MHz, 3300MHz మరియు 26GHz బ్యాండ్‌లను రూ.88,078 కోట్లతో జియో కొనుగోలు చేసింది. మరి.. త్వరలో రాబోతున్న జియో 5G సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.