పండగల సమయంలో బంగారు ఆభరణాల సంస్థలు ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు, రాయితీలు ఇస్తుంటాయి. అక్షయ తృతీయ నాడు కూడా కొన్ని ఆభరణాల సంస్థలు, కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటించాయి. మరి ఆ ఆఫర్లు ఏమిటో తెలుసుకోండి.
హిందువులు ఎంతగానో ఎదురుచూసే పర్వదినాల్లో అక్షయ తృతీయ ఒకటి. ఈరోజున బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే మంచిదని, ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని విశ్వసిస్తారు. ఈ ఒక్కరోజు కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం మంచి జరుగుతుందని నమ్ముతారు. దీనికి తోడు బంగారు ఆభరణాల వ్యాపారులు కూడా ఆభరణాలపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు, రాయితీలు, క్యాష్ బ్యాక్ లు వంటివి ఇస్తుంటారు. ఏప్రిల్ 22న అక్షయ తృతీయ కావున ఆభరణాల సంస్థలు జనాన్ని ఆకర్షించేందుకు పలు ఆఫర్లు ప్రకటించాయి. మరి ఏ ఏ బంగారు నగల సంస్థలు ఎంత మేర డిస్కౌంట్లు ఇస్తున్నాయి? తరుగు మీద ఎంత శాతం తగ్గింపు ఇస్తున్నాయి? క్యాష్ బ్యాక్ ఎంత వస్తుంది? అనే వివరాలు మీ కోసం.
ఫోన్ పే యాప్ ద్వారా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేస్తే వారికి ఉచిత స్టోరేజ్ సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. కస్టమర్ తరపున బంగారం అమ్మినవారే బ్యాంక్ గ్రేడ్ ఇన్సూర్డ్ లాకర్ లో భద్రపరుస్తారని ఫోన్ పే తెలిపింది. లాకర్ లో ఉన్న బంగారాన్ని కస్టమర్లు ఎప్పుడైనా అమ్ముకోవచ్చునని తెలిపింది. అమ్మగా వచ్చిన డబ్బును 48 గంటల్లో కస్టమర్ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. ఇక బంగారు నగల తయారీపై ఎటువంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. అలానే అక్షయ తృతీయ రోజున (ఏప్రిల్ 22న) 1 గ్రాము కంటే ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసిన వారికి రూ. 50 నుంచి రూ. 500 క్యాష్ బ్యాక్ వస్తుందని ఫోన్ పే తెలిపింది.