ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పవర్ ఫుల్ ఏదో తెలుసా? అవసరం. అవును.. అవసరం ఏదైనా నేర్పిస్తుంది. ఆ అవసరం నుండే అద్భుతమైన ఐడియాలు పుడతాయి. అలాంటి ఓ ఐడియా సక్సెస్ అయితే ఇక జీవితంలో వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒడిశా సంబల్పూర్ జిల్లాకు చెందిన ముండా అనే యువకుడి కథ కూడా సరిగ్గా ఇలాంటిదే. ముండా ఓ సాధారణ దినసరి కూలి. పనికి పోవడం, వచ్చిన డబ్బుతో అవసరాలు తీర్చుకోవడం తప్ప అతనికి ఇంకేమి తెలియదు. కానీ.., పోయిన ఏడాదిలో వచ్చిన లాక్ డౌన్ అతని జీవితాన్ని మార్చేసింది.
లాక్ డౌన్ కారణంగా ముండా చేతిలో పని లేకుండా పోయింది. అప్పుడు యూట్యూబ్ లో ఫుడ్ వీడియోస్ చూడటం అలవాటు చేసుకున్నాడు. తాను కూడా ఇలానే ఫుడ్ వీడియోస్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ యువకుడు. నిజానికి అప్పటికి అతని దగ్గర కనీసం స్మార్ట్ ఫోన్ కూడా లేదు. స్నేహితుల దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడు. ఆ తరువాత ఫుడ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇందుకోసం ముండా ప్రత్యేకంగా చేసిన కసరత్తులు ఏవి లేవు. రోజు తాను ఏ ఆహరం అయితే తింటాడో.., దాన్నే వీడియోగా తీయడం అలవాటు చేసుకున్నాడు.
తన మొదటి వీడియోగా ఒక ప్లేట్ లో అన్నం, పచ్చి టమాటో, పచ్చిమిర్చి కలిపి తింటున్న వీడియో ను పోస్ట్ చేశాడు. ఆశ్చర్యకరంగా అతను మొదటి వీడియోనే సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక అక్కడ నుండి ముండా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ముండా ఏ వీడియో పోస్ట్ చేసినా లక్షల వ్యూస్ రావడం మొదలయ్యాయి. ఇలా ఏడాది కాలంలో అతని ఛానెల్ కి 7 లక్షల మంది సబ్ స్క్రయిబర్స్ అయ్యారు. ఇప్పుడు ముండా నెలకి రూ.5 లక్షల సంపాదిస్తున్నాడు. ఇదంతా కేవలం ఒక్క ఏడాదిలో జరిగిన అద్భుతం.
ఈ విషయంపై ముండా స్పందించాడు. “నా వీడియోస్ ఇంతలా సక్సెస్ కావడానికి కారణం.. కేవలం నేను తినే ఫుడ్ మాత్రమే కాదు. నా నేపధ్యం కూడా ఇందుకు కారణం. నేను చేసే వీడియోల్లో నా ఇళ్లు , తమ గ్రామంలో ప్రజలు జీవన విధానం ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం వచ్చిన డబ్బులతో తన తల్లి దండ్రలుకు ఇల్లు కట్టానని, ఇకపై నా చుట్టూ ఉన్న పేదలకి సహాయం చేస్తా” అని ముండా తెలిపాడు. ప్రస్తుతం ముండా యూట్యూబ్ ఛానెల్ వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.