సాధారణంగా బ్యాంకులకు ఆదివారాలు, పండుగ రోజుల్లో మాత్రమే కాక నెలలో రెండో శనివారం, నాల్గవ శనివారం కూడా సెలవే. మరి నెలలో 5 శనివారాలు వస్తే.. ఆ రోజు బ్యాంక్ పని చేస్తుందా లేదా అంటే..
సాధారణంగా నెలకు నాలుగు శనివారాలు, ఆదివారాలు వస్తుంటాయి. కానీ కొన్ని నెలల్లో మాత్రం ఐదు శనివారాలు, ఆదివారాలు వస్తాయి. నెలకు ఎన్ని ఆదివారాలు ఉన్నా పర్లేదు.. కానీ శనివారాలతోనే అప్పుడప్పుడు కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే.. శనివారాలకు సంబంధించి బ్యాంకులకు ప్రత్యేక రూల్స్ ఉంటాయి. ఆదివారం, పండుగ రోజులు, జాతీయ సెలవు దినాలతో పాటు.. ప్రతి నెల రెండో శనివారం, ఆదివారం బ్యాంకులు పని చేయవు. మరి నెలలో ఐదో శనివారం వస్తే.. నాడు పరిస్థితి ఏంటి.. బ్యాంకులు పని చేస్తాయా లేదా.. అంటే..
బ్యాంక్‌లకు ఆదివారం, పండుగ రోజులు, జాతీయ సెలవు దినాల్లో మాత్రమే కాక ప్రతి నెల రెండో శనివారం, నాల్గవ శనివారం కూడా సెలవే. అయితే ఏప్రిల్ నెలలో మొత్తం ఐదు శనివారాలు వచ్చాయి. దీంతో ఐదో శనివారం అంటే ఇవాళ బ్యాంకులు పనిచేస్తాయా లేదా అనే గందరగోళం అందరిలో నెలకొంది. ముఖ్యంగా ఐదో శనివారం రోజు బ్యాంకులకు ఏమైనా సెలవు ఉంటుందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ రోజు బ్యాంకులో పని ఉంది.. వెళ్లాలా లేదా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. మరి ఇంతకు నేడు బ్యాంకులకు సెలవు ఉందా అంటే.. లేదు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ప్రకారం.. పబ్లిక్, ప్రైవేట్, ఫారెన్, కోఆపరేటివ్, రీజనల్ రూరల్, లోకల్ ఏరియా బ్యాంకులు, షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు అన్నింటికి నెలలో రెండు, నాలుగు శనివారాలు మాత్రమే పబ్లిక్ హాలిడేను పాటించాలి. ఈ శనివారాలు మినహా మిగతా రోజుల్లో బ్యాంకులు పనివేళలుగానే పరిగణించాలి అని ఉంది. 2015, సెప్టెంబర్ 1 నుంచి ఈ నియమం అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి ఆర్బీఐ 2015, ఆగస్టు 28న నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనిని బట్టి ఒక విషయం క్లియర్‌గా అర్థం అవుతోంది. బ్యాకులు ఆదివారాలు, పండుగలతో పాటు ప్రతి నెలా రెండో, నాలుగో శనివారాలు మాత్రమే పనిచేయవు. మొదటి, మూడో, ఐదో శనివారం బ్యాంకులు తెరిచే ఉంటాయి. ఐదో శనివారం.. జాతీయ సెలవు దినం, పబ్లిక్ హాలిడే లేని పక్షంలో కచ్చితంగా బ్యాంకులు తెరవాలి. అంటే ఏప్రిల్ 29న (ఐదో శనివారం) బ్యాంకులు పనిచేస్తాయి. ఇక ఈ ఏప్రిల్ నెలలో మొత్తంగా 15 రోజులు బ్యాంకులకు సెలవు ఉంది. ఈసెలవుల సంఖ్య రాష్ట్రాలు, స్థానిక పండుగలను బట్టి మారుతుంది. ప్రస్తుతం బ్యాంక్‌కు వెళ్లేవారి సంఖ్య చాలా వరకు తగ్గింది. డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి రావడంతో.. అన్ని ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. క్యాష్ ట్రాన్సాక్షన్లు, ట్రాన్స్‌ఫర్లు, డిపాజిట్లు వంటివి చేసుకోవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీని కోసం ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లు, యూపీఐ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి.