సొంతింటి కల సాకారం చేసుకునేందుకు హోమ్ లోన్ తీసుకోవాలి అని అనుకుంటున్నవారికి బ్యాంక్ బరోడా శుభవార్త చెప్పింది. తాజాగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను భారీగా తగ్గించి బంపర్ ఆఫర్ ఇచ్చింది. 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేటు 6.5 శాతానికి దిగొచ్చింది. ఇది వరకు హోమ్ లోన్ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉండేది. బ్యాంక్ తాజా వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం వల్ల హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది.
అక్టోబర్ 7 నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు అమలులోకి వచ్చింది. ఈ వడ్డీ రేట్లు డిసెంబర్ చివరి వరకు ఉంటాయని బ్యాంక్ తెలిపింది. చౌక వడ్డీకే గృహ రుణం వల్ల చాలా మంది ఊరట కలుగనుంది. ఇకపోతే కొత్తగా హోమ్ లోన్ తీసుకునే వారికి, అలాగే ఇతర బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థల నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకు హోమ్ లోన్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా.. ఇంకా లోన్ రీఫైనాన్స్ చేసుకోవాలని భావించే వారు తక్కువ వడ్డీ రేటు ప్రయోజనం పొందొచ్చని బ్యాంక్ వివరించింది. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు బెనిఫిట్ కూడా ఉంది.