టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థకు గట్టి షాక్ తగిలింది. రెండు దశాబ్దాలుగా ఆ కంపెనీకి సేవలందిస్తున్న కీలక ఉన్నతాధికారి వైదొలిగారు. ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు షాక్ తగిలింది. నెలల వ్యవధిలో ఈ కంపెనీ నుంచి మరో ఉన్నతాధికారి వైదొలిగారు. కంపెనీ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీకి ఇన్ఫోసిస్ శనివారం సమాచారం ఇచ్చింది. ‘ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషీ ఇవాళ రాజీనామా చేశారు. మార్చి 11 నుంచి మోహిత్ సెలవులో ఉండనున్నారు. జూన్ 9, 2023.. సంస్థలో ఆయనకు చివరి వర్కింగ్ డే’ అని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక, మోహిత్ జోషి కెరీర్ విషయానికొస్తే.. ఇన్ఫోసిస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్/లైఫ్ సైన్సెస్ బిజినెస్‌కు ఆయన నేతృత్వం వహిస్తూ వచ్చారు. 2000 సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో చేరారు మోహిత్ జోషి.
రెండు దశాబ్దాలకు పైగా ఇన్ఫోసిస్‌లో విభిన్న స్థాయుల్లో మోహిత్ జోషి పనిచేశారు. ఎడ్జ్‌వర్వ్ సిస్టమ్స్‌కు ఛైర్మన్‌గానూ వ్యవహరించారు ఆయన. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఇన్ఫోసిస్ తరఫున జోషీ అటెండ్ అయ్యారు. కానీ ఆ తర్వాత గోవాలో జరిగిన ఇన్ఫీ లీడర్షిప్ సమావేశంలో మాత్రం పాల్గొనలేదు. దీంతో మోహిత్ రాజీనామా వార్తలు బయటకు వచ్చాయి. కాగా, ఇన్ఫీని వీడిన జోషీ.. మరో టెక్ సంస్థ అయిన టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యారు. ఈ మేరకు టెక్ మహీంద్రా శనివారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. జోషీని తమ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించామని పేర్కొంది. ప్రస్తుత టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ ఈ ఏడాది డిసెంబరు 19వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజున జోషీ.. గుర్నారీ ప్లేసులో బాధ్యతలు చేపట్టనున్నట్లు టెక్ మహీంద్రా ఒక ప్రకటనలో తెలిపింది.
#TechMahindra appointed former #Infosys President Mohit Joshi as Managing Director and CEO, the company informed in a regulatory filing.
Joshi will take over for C P Gurnani, who is retiring on December 19
Details: https://t.co/b7MKya3ICJ pic.twitter.com/7sJyHHClue
— Hindustan Times (@htTweets) March 11, 2023