జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని, మబ్బుల చాటున ఆకాశంలో విహరించాలని.. అందరూ కలలు కనడం సహజం. గాల్లో తేలియాడుతూ.. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండటం వల్ల.. అలా కలలు కనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి దేశీయ విమానయన సంస్థ ఇండిగో గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఎక్కడికైనా రూ.1616 కే విమాన ప్రయాణం చేయండి అంటూ ప్రకటించింది.
దేశీయ విమానయాన సంస్థ ‘ఇండిగో’ స్కైస్‌లో 16 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకుంది. తన 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘స్వీట్ 16’ (IndiGo ‘sweet 16’ anniversary sale) పేరుతో వార్షిక ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. అన్ని దేశీయ రూట్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఇండిగో సంస్థ తెలిపింది. కేవలం.. రూ.1616తో దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించొచ్చు. ఈ ఆఫర్ ఆగస్టు 3న ప్రారంభమై ఆగస్టు 5న ముగుస్తుంది. 18 ఆగస్టు 2022 మరియు 16 జూలై 2023 మధ్య ప్రయాణానికి ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. అలాగే.. ఇండిగో HSBC క్రెడిట్ కార్డ్‌ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవడంపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తుంది.
ఈ విషయంపై ఇండిగో చీఫ్ స్ట్రాటజీ అండ్ రెవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ..”ఇండిగో సంస్థ తక్కువ ఖర్చుతో కూడిన, అవాంతరాలు లేని సేవలను అందించడంలో విజయవంతమైన పదహారేళ్ళను పూర్తి చేసుకుంది. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి, మేము ఆఫర్ ప్రకటించామని తెలిపారు”. ఈ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Our #Sweet16 is here and we’ve got a sweet deal for you. 🎉🎉
Book your flights with fares starting at ₹1,616*. Don’t wait up, offer only valid till 5th August, 2022 for travel between 18th August, 2022 and 16th July, 2023. https://t.co/ViwbeYHuhQ#6ETurns16 #LetsIndiGo pic.twitter.com/CsekvQJtsx
— IndiGo (@IndiGo6E) August 3, 2022
ఇదీ చదవండి: Amazon Layoffs: లక్ష మంది ఉద్యోగులను తీసేసిన అమెజాన్.. కారణం ఏంటంటే..?
ఇదీ చదవండి: భారత్ లో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓ.. ఏడాదికి రూ.123 కోట్లా?