ప్రతి సంస్థలోనూ ఓ సాఫ్ట్ వేర్ ఉంటుంది. అందుకోసం సాఫ్ట్ వేర్ నిపుణుల బృందం ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఆ సాఫ్ట్ వేర్ లో బగ్స్ రూపంలో దోషాలు ఏర్పడి.. పనికి అడ్డంకిగా మారతాయి. అవి సంస్థలు సైతం కనిపెట్టలేవు. దీంతో హ్యాకర్లు, సాఫ్ట్ వేర్ నిపుణులు రంగంలోకి దిగి వాటిని కనిపెడుతుంటారు. కనిపెడితే భారీ నజరానా కూడా తీసుకుంటారు.
చిన్నప్పుడు ఏదన్నా తప్పులు చేస్తే తల్లిదండ్రులు, గురువులు మనల్ని కొడతారు. అది సహజం. కానీ అదే వారి తప్పులు లేవనెత్తి చూపితే తిడతారు. ఎవ్వరి వాదన అయినా కరెక్టు కాదని చెబితే గుర్రుగా చూస్తారు. అయితే అవే తప్పులు వెతికితే లక్షలకు లక్షలు ఇస్తున్నాయి పలు కంపెనీలు. అయితే ఇక్కడకు వచ్చే సరికి వాటిని బగ్స్ అని పిలుస్తారు. అంటే కంపెనీకి సంబంధించిన సాఫ్ట్ వేర్లలో కొన్ని దోషాలు, తప్పులు దొర్లుతుంటాయి. అవి ఎంత వెతికినా కనిపించవు. అటువంటి వాటిని వెతికేందుకు సాఫ్ట్ వేర్ నిపుణులు , హ్యాకర్లు రంగంలోకి దిగాల్సిందే. అలా బడా సంస్థకు చెందిన యాప్‌లో ఎవ్వరూ కనిపెట్టలేని బగ్‌ను ఓ వ్యక్తి చేధించి.. భారీ నజరానాను కొల్లగొట్టాడు. ఇంతకు ఆ సంస్థ ఏంటంటే.?
ఇప్పుడు ప్రతి సంస్థ కూడా తమ కంపెనీకి తగ్గట్టుగా సాఫ్ట్ వేర్లను రూపొందించుకుంటాయి. అందుకోసం సాఫ్ట్ వేర్ నిపుణుల బృందం ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఆ సాఫ్ట్ వేర్లలో బగ్స్ రూపంలో దోషాలు ఏర్పడి.. పనికి అడ్డంకిగా మారతాయి. అవి సంస్థలు సైతం కనిపెట్టలేవు. కొంత మంది సాఫ్ట్ వేర్ నిపుణులు, హాక్యర్లు ఆ సమస్యను పరిష్కరించి సంస్థల నుండి లక్షల్లో నజరానాను తీసుకుంటారు. ఊబర్ కంపెనీ ఇటువంటి సమస్యనే ఎదుర్కొనగా, ఓ భారతీయ హ్యాకర్ కనిపెట్టాడు. ఉబర్ యాప్ గురించి అందరికీ తెలిసిందే. మనం సమీప దూరంలో ఎక్కడి వెళ్లాలన్న ఈ యాప్ పై క్లిక్ చేసి.. వెళ్లాల్సిన వివరాలు పూర్తి చేస్తే సరిపోతుంది. ఈ యాప్ , ఆ సంస్థ సేవల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ రైడింగ్ యాప్‌లో ఆ కంపెనీ కూడా గుర్తించని ఓ బగ్‌ని భారత్‌కు చెందిన ఆనంద్ ప్రకాశ్ అనే ఎథికల్ హ్యకర్ కనిపెట్టాడు. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు.
ఈ ఉబర్‌లో ఉన్న ఈ బగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఉచితంగానే రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. దీంతో కంపెనీ ఎక్కువ నష్టాలు చవిచూడాల్సి వచ్చేది. చివరకి ఆనంద్ ప్రకాశ్ దాన్ని ఎంతో శ్రమించి.. కనిపెట్టడంతో సంస్థ భారీ నష్టాల నుండి బయటపడింది. అయితే అతను ఈ బగ్ గురించి చెప్పేవరకు ఆ కంపెనీ కూడా గుర్తించకపోవడం గమనార్హం. 2017లో కనుగొనగా..2019లో దీని గురించి కంపెనీకి వివరించాడు. కంపెనీకే తెలియని విషయాన్ని కనిపెట్టినందుకు ఆనంద్ ప్రకాశ్ కు ఉబర్ బంఫరాఫర్ ప్రకటించింది. జీవితాంతం ఫ్రీ రైడింగ్ అవకాశాన్ని కల్పించింది. అంతేకాకుండా అతనికి కంపెనీ రూ. 4.5 లక్షల భారీ నజరానా అందించింది. అయితే ఇటీవల ఆనంద్ ప్రకాశ్ ఈ బగ్ గురించి లింక్డిన్ పోస్ట్ ద్వారా వివరించాడు.