కరోనా మహమ్మారి రాక, ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ కలిగేలా చేసింది. ఇలాంటి మహమ్మారి మరొకటి వతుందేమో అన్న భయంతో, యువత నుంచి మొదలు వృద్ధ్యాప్యం దాకా అందరూ.. ఉదయాన్నే లేచినప్పటినుంచే గ్రౌండ్ ల వెంబడి పరుగులు పెడుతున్నారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువుగా నివసించే మనదేశంలో.. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలయితే లక్షలు పెట్టి వైద్యం చేయించలేం. పోనీ, అలా పెట్టామా.. ఆ అప్పుల నుండి కోలుకోవడానికి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఇలాంటి సమయాల్లో మనకు ఆసరాగా ఉండేది.. ఆరోగ్య బీమా.
మొన్నటి వరకు ఆరోగ్య బీమా తీసుకోవడానికి అందరూ వెనకడుగు వేసేవారు. ఎప్పుడైతే కరోనా మహమ్మారి లక్షలు ఖర్చుపెట్టించిందో.. అప్పటి నుంచి ఇలాంటి పాలసీలు తీసుకునేవారి సంఖ్య ఎక్కువయ్యింది. నిజానికి ఆరోగ్య బీమా పాలసీలు ఖరీదైనవి. అయితే.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రత్యేక గ్రూప్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్‌తో ముందుకు వచ్చింది. దీని ద్వారా, మీరు కేవలం రూ. 299 మరియు రూ. 399 ప్రీమియంతో రూ. 10 లక్షల బీమా పొందొచ్చు.
అందుకోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, టాటా AIGతో ఒప్పందం కుదుర్చుకుంది. 18 నుండి 65 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా ఈ పాలసీలు తీసుకోవచ్చు. రెండు పాలసీల్లోనూ, ప్రమాదం కారణంగా మరణం సంభవించినా, శాశ్వత లేదా పాక్షిక పూర్తి అంగవైకల్యం కలిగినా, పక్షవాతానికి గురైనా.. రూ.10 లక్షల భీమా లభిస్తుంది. ఈ ప్రీమియం అనేది.. ఒక ఏడాదికి మాత్రమే. మునుపటుకి కొనసాగాలి అనుకుంటే.. ఆటో ప్రీమియం ఎంచుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవాలంటే.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతా తప్పక ఉండాలి.
ప్రయోజనాలు:
రూ.299 పాలసీ: రూ.299 పాలసీలో, రూ.399 పాలసీలో ఇస్తున్న అన్ని సౌకర్యాలు ఉంటాయి. కానీ, ఈ రెండు పథకాలకు మధ్య ఉన్న తేడా ఏమిటంటే రూ.299 ప్రమాద రక్షణ పథకంలో.. మరణించిన వారిపై ఆధారపడిన వారి పిల్లల విద్య కోసం అందే సహాయం ఇందులో ఉండదు.
రూ. 399 పాలసీ: పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలతో పాటు, ఇద్దరు పిల్లల చదువు కోసం రూ. 1 లక్ష వరకు, 10 రోజుల పాటు ఆసుపత్రిలో రోజువారీ ఖర్చులు 1,000, కుటుంబానికి రూ. 25,000 వరకు రవాణా ఖర్చులు అందిస్తారు.అలాగే.. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అంత్యక్రియల కోసం రూ. 5,000 ఇస్తారు.
పైన చెప్పబడిన రెండు పాలసీలు, మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగకరమైనవి. ఈ బీమా మీరూ, తీసుకోవాలనుకుంటే.. దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించవచ్చు. ఈ పాలసీపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.