ప్రపంచ వ్యాప్తంగా చైనా కంపెనీల దూకుడు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైనా మార్కెట్ లో దొరకని వస్తువులు అంటూ ఏవీ ఉండవు. అయితే ఇటీవల భారత్ పై చైనా కవ్వింపు చర్యలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా మొబైల్ సంస్థలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపై రూ.12వేల లోపు ఫోన్లు విక్రయాలపై పరిమితులు విధించనుందా? అవుననే చెబుతున్నాయి విశ్వసనీయ వర్గాలు. భారత్ లో చైనా మొబైళ్లకు మంచి మార్కెట్ ఉంది.. ఇప్పుడు కేంద్ర నిర్ణయంతో ఈ మార్కెట్‌ను కోల్పోవడం చైనా సంస్థలకు పెద్ద ఎత్తున నష్టం జరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్ లో ఎక్కువ శాతం రూ.12 వేల లోపు సెల్ ఫోన్లే ఎక్కువగా ఉంటాయి. మద్యతరగతి కుటుంబాల వారు ఎక్కువగా ఈ రేంజ్ ధరలో ఉన్న ఫోన్లను కొంటుంటారు. అంతేకాదు స్థానిక ఫోన్లు అస్లెంబ్లింగ్ చేసే దేశీయ సంస్థలు కూడా ఈ మోడళ్లే రూపొందిస్తుంటాయి. ఇటీవల భారత్ లో ఎక్కువగా చైనా కంపెనీల డామినేషన్ నడుస్తుంది. ఈ క్రమంలో షియామీ, వివో, ఓపో, రియల్‌మీ వంటి చైనా సంస్థల దూకుడుతో, స్వదేశీ సంస్థలైన లావా, మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలకు మనుగడ లేకుండా పోతుంది. విడిగాభాలు, ఫోన్ల తయారీకి భారీ ప్లాంట్లు కలిగిన చైనా సంస్థలకు స్వదేశీ ఫోన్ల కంపెనీలు పోటీ ఇవ్వలేక ఢీలా పడిపోతున్నాయి.
ఈ ఇబ్బందులు తొలగిపోయేలా చర్యలు చేపట్టేందుకు కేంద్రం సిద్దం అయినట్లు తెలుస్తుంది. భారత్ లో చైనా మొబైళ్ల కంపెనీలకు చెక్ పెట్టే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. మార్కట్ లో లభించే రూ.12,000లోపు విభాగంలో చైనా సంస్థల ఫోన్లను భారత్‌లో విక్రయించకుండా కొన్ని కండీషన్లు విధించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు ఓ నివేధిక వెల్లడించింది. భారత్ లో ఈ ఫోన్లలో 80 శాతం వాటా చైనాదే ఉంటుంది. ఇలా జరిగితే.. మన దేశంలో చైనా కంపెనీలకు కష్టాలు తప్పవని.. ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల పేర్కొనడం గమనార్హం.
ఈ విషయంపై ఇక ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధిచిన ప్రత్యేక విధానం తెస్తుందా.. లేదా అనధికారికంగా ఈ మ్యాటర్ చైనా కంపెనీలక చేరవేస్తుందా అనే విషయం తెలియాల్సి ఉందని ఈ పరిణామంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.