ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారా? సమస్యల నుంచి గట్టెక్కడానికి లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఇంట్లో కూర్చొనే క్షణాల్లో ఈజీగా లోన్ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం తప్పక చదవాల్సిందే.
వాట్సాప్ అంటే చాటింగ్ చేయడాలు,స్టేటస్ పెట్టుకోవడాలు, ఫోన్ సంభాషణలే కాదు, ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడే గట్టెక్కించే వెసులుబాటు కూడా ఉంది. వాట్సప్ ద్వారా క్షణాల్లో రూ. 10 లక్షల లోన్ పొందవచ్చు. వినటానికి ఇది కొత్తగా అనిపించినా ఇది నిజమే. దేశంలో 45 కోట్ల మందికి పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు. వారిని లక్ష్యంగా చేసుకొని ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ ‘ఐఐఎఫ్ఎల్’ ఈ తరహా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ వాట్సాప్ ద్వారా లోన్ ఎలా పొందాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
వాట్సాప్ ద్వారా లోన్ అనే సదుపాయాన్ని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థ కల్పిస్తోంది. దీని ద్వారా ఏకంగా రూ. 10 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఈ సేవలు రోజులో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్, బిజినెస్ లోన్, మైక్రోఫైనాన్స్ వంటి పలు రకాల సర్వీసులు అందిస్తోంది. లోన్ తీసుకోవాలి అనుకునే వారు మొదటగా 9019702184 నెంబర్‌కు హాయ్ అని వాట్సాప్ నుండి మెసేజ్ చేయాలి. తర్వాత కంపెనీ కోరిన సమాచారం అందించాలి. కేవైసీ, బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ వంటివి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నిమిషాల వ్యవధిలో ఆన్‌లైన్ వేదికగా పూర్తి చేయవచ్చు.
కాగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థ దేశంలోని అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటని చెప్పుకోవచ్చు. హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్, బిజినెస్ లోన్, మైక్రోఫైనాన్స్ వంటి పలు రకాల సర్వీసులు అందిస్తోంది. ఈ సంస్థ ప్రధానంగా చిరు వ్యాపారాలు చేసేవారిపై ద్రుష్టి పెడుతున్నట్లు కంపెనీ బిజినెస్ హెడ్ భరత్ అగర్వాల్ అన్నారు. వాట్సాప్ ద్వారా ఈ సేవలు మీరు ఇప్పటికే పొందినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
IIFL Finance offers business loan on WhatsApp. The process is end-to-end digital. #IIFL #DigitalLoan https://t.co/4kSzAts6ix
— IIFL Finance (@IIFL_Finance) May 5, 2023