స్థలం కొంటే సరిపోద్దా? డబ్బు లేకపోయినా ఇల్లు కట్టొచ్చా? అవును స్థలం కొనడానికి డబ్బు ఉన్నా, స్థలం ఉన్నా చాలు. మీ వద్ద ఆపై డబ్బులు లేకపోయినా, బ్యాంకు లోన్లు అవసరం లేకుండానే మీరు సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. అదెలాగో మీరే చూసేయండి.
సొంతింటి కల అనేది చాలా మందికి ఉంటుంది. ఎప్పటికైనా ఇల్లు కొనుక్కోవాలి అని నిద్రపోయే ముందు ఆలోచించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ఇల్లు కట్టాలంటే ముందు స్థలం కొనాలి. స్థలం రేటు చూస్తే చుక్కల్లో ఉంటుంది. ఈ రేటుకి సొంతూర్లలో (పల్లెటూర్లలో) ఒక స్థలం కొని, ఆ స్థలంలో ఇల్లు కట్టేయవచ్చునని అనిపిస్తుంది. కానీ వృత్తి రీత్యా ఉండేది నగరంలో. ఇప్పట్లో సొంతూరు వెళ్లి బతికేది లేదు. కాబట్టి నగరంలోనే సొంతిల్లు ఉంటే బాగుణ్ణు అని అనుకుంటారు. కానీ స్థలం కొని ఇల్లు పూర్తి చేయాలంటే కోట్లలో వ్యవహారం. ఉన్న ఆదాయం చూపించి తెచ్చుకున్న లోన్ తో స్థలం మాత్రమే వస్తుంది. కానీ ఇల్లు ఎలా పూర్తి చేయగలం అని చెప్పి చాలా మంది పునాది దగ్గరే ఆగిపోతున్నారు.
మీ సమస్యకు పరిష్కారమే బిల్డర్స్. అవును మీ దగ్గర స్థలం ఉన్నా, స్థలం కొనుక్కోవడానికి డబ్బు ఉన్నా మీ ఇంటిని బిల్డర్స్ నిర్మిస్తారు. మీరు వారికి ఒక్క రూపాయి చెల్లించాల్సిన పని లేదు. కానీ మీరు కలలు కన్న ఇల్లు పూర్తవుతుంది. దీనికి మీరు చేయవలసిందల్లా బిల్డర్స్ కి మీరు కోన్ స్థలంలో కొంత స్థలంలో వారు ఫ్లాట్లు కట్టుకునేలా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక 150 గజాల (మూడు సెంట్లు) స్థలం మీరు కొనుక్కుంటే.. బిల్డర్ ఆ స్థలంలో 5 ఫ్లోర్లు కడతాడు. అందులో మీ కోసం 2 ఫ్లోర్లు లేదా 3 ఫ్లోర్లు కేటాయించి మిగతావి బయట వాళ్లకు అమ్ముకుంటాడు. ఆ డబ్బు అతనే తీసుకుంటాడు. ఎందుకంటే అతని డబ్బులతో మొత్తం 5 ఫ్లోర్లు కట్టాడు కాబట్టి.
బ్యాంకుల నుంచి తెచ్చుకుంటాడో, ఎక్కడ నుంచి తెచ్చుకుంటాడో అతని ఇష్టం. ఆ బాధలేవో అతనే పడతాడు. మీరు స్థలం కొంటే చాలు. మీరు కొన్న స్థలం డబ్బులకు మీకంటూ సొంత ఇంటితో పాటు మరొక ఇల్లు కూడా ఉంటుంది. ఆ ఇంటిని అద్దెకు ఇచ్చుకుంటే అదే మీ లోన్ ని తీర్చేస్తుంది. దీని కంటే ఫ్లాట్ కొనుక్కోవడం ఉత్తమం కదా అని మీకు అనిపిస్తుంది. కానీ ఫ్లాట్ క్వాలిటీగా కట్టారో లేదో అన్న అనుమానం ఉంటుంది. పైగా ఫ్లాట్ కాల పరిమితి వ్యాలిడిటీ ఇండివిడ్యుయల్ హౌజ్ లతో పోలిస్తే తక్కువ ఉంటుంది. అదే మీ సొంత ఇంటి కోసం పెట్టుకున్న బిల్డర్స్ అయితే క్వాలిటీగా కట్టి ఇస్తారు. ఆ సమయంలో మీరు దగ్గరుండి చేయించుకోవచ్చు.
కొంతమంది కనీసం 300 గజాల స్థలం ఉంటే ఇల్లు పూర్తి చేసి ఇస్తామని అంటారు. కొంతమంది కేవలం పైన స్లాబ్ వేసి, చుట్టూ గోడలు మాత్రమే కట్టించి ఇస్తారు. అయితే వారు ఫ్లోర్లు తక్కువ తీసుకుంటారు. మీ కోసం ఎక్కువ కేటాయిస్తారు. ఏది ఏమైనా గానీ మీరు కొన్న స్థలంతో మీకంటూ ఒక రెండు లేదా మూడు అంతస్తుల ఇండివిడ్యుయల్ హౌజ్ అనేది ఖర్చు లేకుండా వస్తుంది. ఇంతకంటే గొప్ప డీల్ ఇంకేముంటుంది చెప్పండి. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ కాన్సెప్ట్ తోనే చాలా మంది తమ సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారు. మరి ఈ కాన్సెప్ట్ మీకు నచ్చిందా? లేదా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.