ప్రతి మనిషికి కోర్కెలు ఉండటం అనేది సహజం. కొందరికి మంచి ఉద్యోగం సంపాందించి..హాయిగా స్థిరపడాలని కోరుకుంటారు. మరికొందరు వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అయితే అందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఉండాలనే భావిస్తారు. తమ వద్ద డబ్బులు లేక బిజినెస్ ఆలోచనను విరమించుకుంటారు. ఇలాంటి వారికి ఓ మంచి బిజినెస్ ఐడియా ఉంది. అదే వాణిజ్య వ్యవసాయం.. దీని ద్వారా కూడా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. దీనికోసం పొలం ఎక్కువగా ఉండాలి అనే ఆలోచన అవసరం లేదు. కేవలం ఎకరం భూమి ఉన్న కూడా ఈ వాణిజ్య వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం పొంద వచ్చు. మరి.. దీని కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం మన వద్ద విదేశీ జాతుల పుష్పాలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలా మంది యువ రైతులు ఈ విదేశీ జాతి ఫువ్వులను సాగు చేసి నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. పాలీహౌస్ పద్ధతి ద్వారా ఈ పుష్పాలను సాగు చేస్తున్నారు. దేశంలోని పలు చోట్లు ఈ వాణిజ్య వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అలానే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పాలీ హౌస్ పద్దతిలో వ్యవసాయం చేసే విధానం అందుబాటులోకి వచ్చింది. అంతేకాక ఈ పద్దతిలో వ్యవసాయం చేసే వారికి ప్రభుత్వాలు సబ్సిడీ కూడా ఇస్తాయి. అలానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం సబ్సిడీని ఇస్తుంది. సాధారణంగా పాలీహౌస్ ను ఏర్పాటు చేసిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం 2014-15లో 75శాతం సబ్బిడీ ఇచ్చినట్లు తెలుస్తోంది. విదేశీ జాతి పూల సాగును ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతగా కొనసాగుతోంది.
ఇక ఈ సబ్సిడీని ఎస్సీ, ఎస్టీ రైత్తులకు 95 శాతానికి పెంచారు. దీంతో దాదాపు మొత్తం ఖర్చు ప్రభుత్వం నుంచే వస్తుందన్న మాట. అలానే తెలంగాణలో భూమి ఉన్నవారు.. పాలీహౌస్ పద్ధతిలో వ్యవసాయం చేయాలి అనుకుంటే సమీపంలోని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి.. సబ్సిడీ, ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పాలీహౌస్ కార్యక్రమంలో ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంవ్యాప్తంగా 1150 ఎకరాల విస్తీరణంలో చేస్తున్నారు. మొత్తం 917 మంది రైతులు ఈ పాలీహౌస్ వ్యవసాయం చేస్తున్నారు. ఈ పద్ధతితో ఎక్కువగా విదేశాల్లో లభించే పువ్వులను ఉత్పత్తి చేస్తారు. ముఖ్యంగా గులాబీ, జర్బెరా, గ్లాడియులస్, ఆర్కిడ్ పువ్వులను సాగు చేస్తారు. వీటిని వివాహ, ఇతర కార్యక్రమాల అలంకరణలో ఉపయోగిస్తారు. దీంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ పాలీహౌస్ వ్యవసాయని కేవలం ఒక ఎకర విస్తీర్ణంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
ఈ పూల సాగు కోసం ప్రత్యేకం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి ఉపయోగించి సేద్యపు ఎరువులు, కటింగ్, ప్యాకింగ్ వంటి విషయాలపై కచ్చితంగా శిక్షణంగా తీసుకోవాలి. మీతో పాటు అక్కడ పనిచేసే వాళ్లకు కూడా శిక్షణ ఇప్పించాలి. అవగాహన లేకుండా ఈ సేద్యంలోకి దిగితే నష్టపోయే అవకాశం ఉంది. ఈ పూలను ఎక్కువగా ఉపయోగించే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలి. వారితో మంచి పరిచయాలు పెంచుకోవాలి. ఈ పాలీ హౌస్ పద్దతిలో కేవలం పువ్వులనే కాకుండా ఖరీదైన కూరగాయాలను , పండ్లను కూడా సాగు చేయవచ్చు. ఈ వ్యవసాయంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ప్రతి ఏడాది దిగుబడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి.. ఓ వ్యాపారం చేసే ముందు అందుకు సంబంధించిన పూర్తి వివరాలను, అందులోని అనుభవం కలిగిన వారి సలహాలతో ముందుకెళ్లడం మంచిది.