ప్రతి నెలా ఒక గ్రాము బంగారం కొనడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా? క్రమం తప్పకుండా కొనడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి.
బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈరోజుల్లో పేదవారు, మధ్యతరగతి వారు, డబ్బున్న వారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బంగారం కొనుక్కోవాలని చూస్తున్నారు. బంగారం కొనడం అనేది కేవలం కొనడం కాదు.. పెట్టుబడి పెట్టినట్టే. ఎందుకంటే ఇవాళ ఉన్న ధర రేపు ఉండదు. పెరిగిపోతుంది. కొంతమంది ఫిజికల్ గోల్డ్ కొంటారు. కొంతమంది డిజిటల్ గోల్డ్ కొంటారు. అయితే ఫిజికల్ గోల్డ్ కాయిన్స్ కొనడం మంచిదని ఎకనామిస్ట్, స్టాక్ మార్కెట్ నిపుణులు జీవీ రావు చెబుతున్నారు. ప్రతి నెలా ఒక గ్రాము బంగారం కొనడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని అంటున్నారు. భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు.
బంగారం కొనడం అంటే ఆభరణాలు కాదు. గోల్డ్ కాయిన్స్ కొనాలి. బంగారంతో పోలిస్తే గోల్డ్ కాయిన్స్ కి రీసేల్ వేల్యూ అనేది ఉంటుంది. ఎందుకంటే బంగారు ఆభరణాలు కొనడం వల్ల తరుగు, మజూరీ వంటివి ఉంటాయి. అదే గోల్డ్ కాయిన్స్ అయితే తయారీ ఛార్జీలు, వేస్టేజ్ వంటివి ఉండవు. అందుకే బంగారు ఆభరణాలతో పోలిస్తే గోల్డ్ కాయిన్స్ కి వేల్యూ ఎక్కువ ఉంటుంది. అందుకే గోల్డ్ కాయిన్స్ మీద పెట్టుబడి పెట్టడం లాభదాయకమని నిపుణులు చెబుతారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక గ్రాము గోల్డ్ కాయిన్ చొప్పున కొనుగోలు చేస్తే అనేక లాభాలు ఉంటాయని అంటున్నారు. వీలయితే 5 గ్రాములు, 3 గ్రాములు, కనీసం ఒక గ్రాము చొప్పున ప్రతి నెలా కొనుగోలు చేసుకుంటూ వెళ్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.
సంవత్సరానికి 12 గ్రాముల చొప్పున 40 సంవత్సరాల్లో 480 గ్రాములు పోగుజేసుకుంటే గనుక రిటైర్మెంట్ సమయంలో 2 గ్రాముల చొప్పు అమ్ముకున్నా గానీ పెన్షన్ లా డబ్బు వస్తుందని.. దర్జాగా బతకవచ్చునని చెబుతున్నారు. గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల ఎప్పుడైనా వాటిని అమ్ముకోవచ్చు. వాటి వేల్యూ అనేది పెరుగుతుంది. కావాలనుకుంటే వాటిని ఆభరణాలుగా చేయించుకోవచ్చు. అవసరమైతే వాటి మీద ఋణం తెచ్చుకోవచ్చు. వీటన్నిటికీ మించి కుటుంబ సభ్యులలో సంతోషాన్ని నింపవచ్చునని నిపుణులు చెబుతున్నారు. రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ళు అనుకుంటే.. 30 ఏళ్ల వయసు నుంచి క్రమశిక్షణగా నెలకు ఒక గ్రాము బంగారం కొనాలని టార్గెట్ పెట్టుకుని.. ఏడాదికి 12 గ్రాములు కొంటూ 30 ఏళ్లలో 360 గ్రాముల బంగారం పోగవుతుంది. ప్రస్తుత ధర ప్రకారం చూస్తే.. గ్రాము 5 వేలు పైనే. 360 గ్రాములు బంగారం ఇప్పుడు రూ. 18 లక్షలు పైనే. 30 ఏళ్ల తర్వాత దాని విలువ ఎన్ని రెట్లు పెరుగుతుందో మనకి తెలియనిదా.