మీరు బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఎఫ్‌డీలపై ఓ బ్యాంకులో అధిక వడ్డీ రేట్ లభిస్తోంది. ఆ బ్యాంకు ఏంటి..? వడ్డీ ఎంత లభిస్తోంది..? అన్నది తెలియాలంటే కింద చదివేయండి.
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు చాలా మంది ఇష్టపడకపోవచ్చు. అందుకు ముఖ్య కారణం.. తక్కువ వడ్డీ ఉండటమే. అయితే గత కొన్ని రోజులుగా బ్యాంకులు సీనియర్ సిటిజెన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు ఇతర డిపాజిటర్ల వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ అయిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో ఎక్కువ వడ్డీ లభిస్తోంది. కనిష్టంగా 3.50% నుంచి గరిష్టంగా 7.50% వరకు వడ్డీ అందిస్తోంది. సాధారణ పబ్లిక్ తో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. గమనించగలరు.
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం డిపాజిట్లు 7 రోజుల నుంచి 10 ఏళ్ల మెచ్యూరిటీలపై సాధారణ కస్టమర్లకు వడ్డీ రేట్లు 3.50 శాతం నుంచి 7.00 శాతం వరకు అందిస్తున్నట్లు పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం నుంచి 7.50 శాతం వరు వడ్డీ ఆఫర్ చేస్తోంది. అలాగే 18 నెలల 1 రోజు నుంచి 3 ఏళ్ల లోపు డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు గరిష్ఠంగా 7.50 శాతం, సీనియర్లకు 8.00 శాతం వరకు వడ్డీ ఇస్తోంది.
కాలవ్యవధి సాధారణ పబ్లిక్ ఎఫ్‌డి రేటు సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డి రేటు
7 – 14 రోజులు 3.50% 4.00%
15 – 29 రోజులు 3.50% 4.00%
30 – 45 రోజులు 4.00% 4.50%
46 – 90 రోజులు 4.50% 5.00%
91 – 180 రోజులు 5.00% 5.50%
181 – 366 రోజులు 6.75% 7.25%
367 రోజులు – 18 నెలలు 7.25% 7.75%
18 నెలల 1 రోజు – 3 ఏళ్లు 7.50% 8.00%
3 సంవత్సరాల 1 రోజు- 5 ఏళ్లు 7.00% 7.50%
5 సంవత్సరాల 1 రోజు – 10 ఏళ్లు 7.00% 7.50%
గమనిక: వడ్డీ రేట్లు మారుతుంటాయి. గమనించగలరు. అందులోనూ సాధారణ బ్యాంకులతో పోలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిటట్లపై ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని మీ డబ్బును దాచుకోండి.