పండుగల సీజన్ మొదలైందంటే చాలు.. ఈకామర్స్ కంపెనీలు మొదలు.. పెద్ద పెద్ద మాల్స్ వరకు దాదాపు అన్ని భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తాయి. ఇప్పటికే ప్రముఖ ఈకామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్ పేరుతో భారీగా ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఓ బ్యాంక్ కూడా చేరింది. తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. బ్యాంక్ ప్రకటించిన ఆఫర్‌లో భాగంగా 25 వేల రూపాలయ వరకు డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది. దీంతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని కూడా ప్రకటించింది. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సదరు బ్యాంక్ ఇలా ఫెస్టివ్ బొనాంజ ఆఫర్‌ని ప్రకటించింది. ఇంతకు ఏ బ్యాంక్ ఈ ఆఫర్ ప్రకటించింది అంటే..
మరో మూడు రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘ఫెస్టివ్ బొనాంజ’ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో కస్టమర్లు రూ.25 వేల వరకు డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది. దీంతో పాటు పలు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ప్రకటించింది. బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, కన్జూమర్ ఫైనాన్స్, కార్డులెస్ ఈఎంఐలు.. ఇలా అన్నింటిపై ఈ ఫెస్టివ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. అలానే ప్రముఖ ఈకామర్స్ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రాల్లో.. ఐసీఐసీఐ కార్డు ద్వారా షాపింగ్ చేస్తే.. 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుందని వెల్లడించింది.
ఐసీఐసీఐ ప్రకటించి ఈ ఫెస్టివ్ బొనాంజ ఆఫర్‌లో భాగంగా.. ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్, ఖరీదైన బ్రాండ్స్, ఆభరణాలు, నిత్యవసర సరుకులు, ఆటోమొబైల్స్, ఫర్నీచర్, ప్రయాణాలు, ఆహారం ఇలా అన్నింటిపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, మేక్ మై ట్రిప్, ఐఫోన్ 14, శాంసంగ్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, ఎల్‌జీ, డెల్, స్విగ్గీ, జొమాటో, పీసీ జ్యూవెల్లర్స్ వంటి అన్ని కంపెనీల ప్రొడక్ట్స్‌పై కూడా ఐసీఐసీఐ బ్యాంకు.. తన కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందించనుంది. అంతేకాక ఇంటి రుణం, పర్సనల్ లోన్, బంగార రుణాలపై కూడా కస్టమర్లకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి అని అధికారులు తెలిపారు.
ట్రావేలింగ్‌లో భాగంగా.. మేక్‌మైట్రిప్, యాత్ర, క్లియర్‌ట్రిప్, ఈజీ మై ట్రిప్, పేటీఎం వంటి వాటి ద్వారా విమాన టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి కూడా డిస్కౌంట్లు అందించనున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. అలానే ఫుడ్ డెలివరీ యాప్స్ అయిన జొమాటో, స్విగ్గీ, ఈజీడిన్నర్ ప్లాట్‌ఫామ్‌లపై కూడా 20 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అలానే ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కస్టమర్లకు ప్రీఅప్రూవ్డ్ హోమ్ లోన్లు అందుబాటులో ఉంటాయని ఐసీఐసీఐ ప్రకటించింది.
ఇంటి రుణాలు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్లు, ప్రాపర్టీపై రుణాలు వంటి వాటిపై ప్రాసెసింగ్ ఫీజును 50 శాతం వరకు తగ్గించనున్నట్లు వెల్లడించింది. అలానే పండుగ సీజన్‌లో కొత్త కారు కొనుగోలు చేసే వారి కోసం కూడా ఆన్-రోడ్డు వాల్యూకి 100 శాతం వరకు కారు లోన్ పొందే సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఇలా పండుగ వేళ.. భారీ ఆఫర్లు ప్రకటించి.. కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఐసీఐసీఐ బ్యాంక్. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#JustIn: A complete suite of offers across categories await you at the #ICICIBankFestiveBonanza! Immerse yourself in the spirit of the festive season by indulging in a shopping experience like no other.
Get started: https://t.co/Qo7uRNYU90 pic.twitter.com/w2R6X5yz4R
— ICICI Bank (@ICICIBank) September 22, 2022