కారు కొనాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. కారు ఖరీదు లక్షల్లో ఉంటుంది. 5 లక్షలు పెట్టి కొన్నా, 25 లక్షలు పెట్టి కొన్నా ఎంతోకొంత డిస్కౌంట్ ఉంటే బాగుంటుందని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. కస్టమర్ కోరిక మేరకు ఆయా కార్ల కంపెనీలు కూడా వినియోగదారుల కోసం భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. డిస్కౌంట్ తో అటు కస్టమర్ కి ధర తగ్గిందన్న సంతృప్తి, ఇటు కార్ల కంపెనీకి సేల్ అయ్యాయన్న సంతృప్తి దక్కుతుంది. అయితే ఏ కంపెనీ అయినా మహా అయితే ఒక 10 వేలు డిస్కౌంట్ ఇస్తుంది. లేదంటే 20 వేలు, అంతకు మించి డిస్కౌంట్ ఇవ్వడం అనేది కష్టం. కానీ హ్యుందాయ్ కార్ల కంపెనీ మాత్రం ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్ ని అందిస్తోంది.
భారత్ లోని హ్యుందాయ్ కంపెనీ యొక్క డీలర్లు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఆయా కార్లపై లక్ష వరకూ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్ లు, కార్పొరేట్ బోనస్ ల పేరుతో హ్యుందాయ్ కంపెనీ అందిస్తున్న ప్రయోజనాలను పొందవచ్చు. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారుపై లక్ష రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 టర్బో-పెట్రోల్ వేరియెంట్ పై రూ. 35 వేల డిస్కౌంట్ ని ఇస్తున్నారు. ఇదే కారుని ఎక్స్చేంజ్ లో తీసుకుంటే గనుక రూ. 10 వేల ఎక్స్చేంజ్ బోనస్ ని అందిస్తున్నారు. అంతేకాకుండా కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 3 వేలు తగ్గించనున్నారు. గ్రాండ్ ఐ10 నియోస్ మరియు ఆరా కార్ల సిఎన్జీ వేరియెంట్లపై రూ. 25 వేల క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఎక్స్చేంజ్ బోనస్ గా రూ. 10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ గా రూ. 3 వేలు తగ్గింపు లభిస్తుంది. గ్రాండ్ ఐ10 నియోస్ 1.2 లీటర్ పెట్రోల్ వేరియెంట్లపై క్యాష్ డిస్కౌంట్ గా రూ. 15 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ గా రూ. 10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ గా రూ. 3 వేలు తగ్గింపు లభిస్తుంది. ఐ20 మాగ్నా, స్పోర్ట్స్ వేరియెంట్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ ల కింద రూ. 10 వేలు తగ్గింపు లభిస్తుంది. హ్యుందాయ్ ఆరా 1.2 లీటర్ పెట్రోల్ వేరియెంట్లపై రూ. 5 వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 10 వేల ఎక్స్చేంజ్ బోనస్, రూ. 3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తున్నారు. ఇక హ్యుందాయ్ వెన్యూ, క్రెటా, ఐ20 ఎన్ లైన్, వెర్నా, అల్కజార్, టక్సన్ మోడల్స్ పై డిస్కౌంట్ లేదని కంపెనీ తెలిపింది.