మీరు ఎలక్ట్రిక్ స్కూటీ కానీ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకో అదిరిపోయే ఆఫర్. ప్రముఖ వాహన సంస్థ 'ఓలా' స్కూటీలను సగం ధరకే సొంతం చేసుకునే సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. కాకుంటే.. ఈ ఆఫర్ విద్యార్థులకు, ఉద్యోగులకు మాత్రమే.. అది కూడా ఒక్క రోజు మాత్రమే. కావున.. సమయాన్ని వృధా చేసుకోకుండా వెంటనే కోనేయండి.
మీరు ఎలక్ట్రిక్ స్కూటీ కానీ కొనాలనుకుంటున్న వారైతే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రముఖ వాహన సంస్థ ‘ఓలా‘ ఎలక్ట్రిక్ స్కూటీలను సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. కాకుంటే.. ఈ ఆఫర్ విద్యార్థులకు, ఉద్యోగులకు మాత్రమే.. అది కూడా మార్చి 31న ఒక్క రోజు మాత్రమే. కావున సమయాన్ని వృధా చేసుకోకుండా వెంటనే కోనేయాల్సిందిగా మనవి. ఈ ఆఫర్ ఓలా S1 మరియు ఓలా S1ప్రోల మీద వర్తిస్తుంది.
వాస్తవంగా ఓలా ఎస్1 ఎక్స్ షోరూమ్ ధర రూ.1,09,900 కాగా, ఎస్1 ప్రో ధర రూ. 1,39,999. కానీ ఆఫర్ లో భాగంగా ఓలా ఎస్1ను రూ.61,999, ఓలా ఎస్1 ప్రోను రూ. 69,999 లకు సొంతం చేసుకోవచ్చు. విద్యార్థులు, ఉద్యోగుల కోసం ఓలా ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలంటే విద్యార్థులు, ఉద్యోగులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులతో ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించాలి. అక్కడ కొనుగోలుదారులకు ఆఫర్ నిబంధనలు, షరతుల గురించి తెలియజేస్తారు.
ఓలా ఎలక్ట్రిక్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎస్1 ప్రో 12 రంగులతో అందుబాటులో ఉంది. ఇది కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 40 వరకు స్పీడ్ అందుకోగలదు. అలాగే ఇది గరిష్టంగా 116 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. 7 అంగుళాల టచ్ స్క్రీమ్, 8కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, బ్లూటూత్, వైఫై, జీపీఎస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఓలా ఎస్1 ప్రో తరహాలో మ్యూజిక్ ప్లేబ్యాక్ ఫంక్షనాలిటీ ఇందులో కూడా ఉంది. ఇక దీని బ్యాకప్ విషయానికొస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదని కంపెనీ చేప్తోంది. రూ. లక్షా ముప్పై వేలు చెల్లించి దీనిని సొంతం చేసుకోవడం కంటే.. సగం ధరకే చేజిక్కించుకోవడం సువర్ణావకాశమనే చెప్పాలి. కావున కొనాలనుకున్నవారు.. వెంటనే సమీప ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించండి. ఈ ఆఫర్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
If you want to buy an #OlaElectric scooter, today is the last day to avail this offer https://t.co/elEBdIRNgg
— Hindustan Times (@htTweets) March 31, 2023