'రూ. 1,200'.. ఒక గ్యాస్ సిలిండర్. ఈ రేటు చూస్తుంటే కట్టెల పొయ్యి మీద వండిన రోజులు అందరికీ గుర్తుకొస్తున్నాయి. కట్టెలు కొట్టుకురావడం.. అవి ఎండటం కోసం బయటపెట్టడం.. ఆ క్రమంలో వర్షాలు పడ్డప్పుడు వాటిని తీసుకెళ్లి ఇళ్లలో దాచుకోవటం.. ఆ జ్ఞాపకాలే వేరు. కాస్త కష్టమైనా వంటయితే వండుకొని కడుపునిండా ఆరగిలించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ధర ఎక్కువుగా ఉండటంతో గ్యాస్ సిలిండర్ కొనాలంటేనే భయపడిపోతున్నారు.. అందుకే మీకు ఊరట కలిగించే శుభవార్త ఒకటొచ్చింది.
ఒకప్పుడు వంట చేయడం అంటే కట్టెల పొయ్యి మీదనే వండేవారు. ఉదయాన్నే తాగే ‘టీ’ మొదలు రాత్రి తినే అన్నం వరకు అన్నీ కట్టెల పొయ్యి మీదనే. కానీ ఇప్పుడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకుంటే ఆరోజు పస్తులే. అంతలా అడిక్ట్ అయిపోయారు. కాదు.. కాదు.. అడిక్ట్ అయ్యేలా చేసింది.. ప్రభుత్వం. ప్రారంభ రోజుల్లో గ్యాస్ సిలిండర్ రూ.500కే అందబాటులో ఉండేది. ఏముందిలే ‘ఐదు వందల రూపాయిలు’ నాలుగు.. ఐదు నెలల పాటు ఎలాంటి తలనొప్పి లేకుండా వంట చేసుకోవచ్చన్న ఆశతో అందరూ వీటికి అలవాటయ్యారు. క్రమక్రమంగా గ్యాస్ సిలిండర్ ధర 600.. 800.. 1000.. 1200కు వచ్చేసింది. దీంతో వంట వండాలంటేనే జనాలు భయపడుతున్నారు. గ్యాస్ ఆదా అవుతుందన్న ఆలోచనతో రాత్రి తినే వంటను కూడా ఉదయాన్నే వండేస్తున్నారు. పోనీ, ఈ ధరైనా స్థిరమా..? అంటే అదీ చెప్పలేం..
ఏరోజైనా మరో రెండొందలు పెరగొచ్చు. అదే జరిగితే సామాన్యులకు వంట గ్యాస్ కనుమరుగనట్లే. అందుకే దీనికి ప్రత్యామ్న్యాయం చూపే దిశగా ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్ సంస్థ ముందడుగు వేసింది. తక్కువ ధరకు అందుబాటులో ఉండేలా ‘బయో ఇథనాల్’ కుకింగ్ స్టవ్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి భాగస్వామ్యంతో ఇథనాల్ ఫ్యూయెల్ కుకింగ్ స్టవ్స్ మార్కెట్‌లోకి తీసుకురానుంది. అంటే ఎల్‌పీజీ సిలిండర్ అవసరం లేకుండానే మీరు ఇంట్లో వీటి ద్వారా వంట చేసుకోవచ్చు.
బయో ఇథనాల్ అనేది పర్యావరణ అనుకూలం. చెరకు నుంచి దీన్ని తయారు చేస్తారు. కావున దీని రేటు తక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్‌పీసీఎల్ తన రిటైల్ ఔట్‌లెట్స్‌లో ఇథనాల్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకురానుంది. వాటి ద్వారా విక్రయాలు జరగనున్నట్లు సమాచారం. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా మరోవైపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను మార్కెట్‌లోకో తెచ్చే పనిలో ఉన్నాయి. ఈ పెట్రోల్.. సాధారణ పెట్రోల్ తో పోలిస్తే తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఎంత తగ్గొచ్చు అన్న దానిపై స్పష్టత లేదు. ‘బయో ఇథనాల్’ కుకింగ్ స్టవ్స్‌లపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A #cookingstove powered by #ethanolfuel, developed by @HPCL in collaboration with the @IITGuwahati, is expected to be test-launched soonhttps://t.co/pkeW2t3hpT
— Future Fuels (@futurefuels2070) April 7, 2023