సాధారణంగా మార్కెట్లో కొన్ని వస్తువులకు ఎప్పుడు డిమాండ్ తగ్గదు. అలాంటి వాటిలో దుస్తులు ఒకటి. మన దేశం ఎంత ఆధునికమైనదైనా చీరలకు ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. మగువలు మెచ్చే అందమైన చీరలను మీరు విక్రయించినట్లయితే మంచి లాభం ఆర్జించవచ్చు. అలాగే, షాప్ అద్దెకు తీసుకొని అధిక భారం తల మీద వేసుకోకుండా ఇంట్లోనే విక్రయించేలా ప్లాన్ చేసుకోండి. దీని వల్ల అదనపు ఆదాయం పొందవచ్చు.
ఇంట్లో ఉంటూ.. తక్కువ పెట్టుబడితో ఏ బిజినెస్ చేస్తే మంచిది అని ఆలోచన ఉన్న వారికి.. చీరాల వ్యాపారం చక్కని ఐడియా. స్తోమతకు తగ్గట్టుగా ఎంతో కొంత నగదుతో ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారానికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. నష్టాలు వస్తాయన్న బెంగ ఉండదు. అందువల్ల చీరల వ్యాపారాన్ని మీరు ప్రారంభించినట్లయితే తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం వస్తుంది. మొదట్లో కేవలం 10,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టినా సరే అంతకుమించి లాభం పొందవచ్చు.
సంప్రదాయాలకు విలువిచ్చే మనదేశంలో చీరలు వ్యాపారం అత్త్యుత్తమైనది. వెరైటీ, సెలెక్టివ్ చీరలను అందుబాటులో ఉంచారంటే.. మగువలు వాటిని కొనడానికి ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారు. అంతేకాదు మహిళలు చీరలు కొనాలనుకున్నప్పుడు ఆర్థిక స్తోమత కూడా అడ్డురాదు. మనసుకు నచ్చిందంటే ఎంత ధర ఉన్నా సొంతం చేసుకుంటారు. కావున వెరైటీ, సెలెక్టివ్ చీరలను అందుబాటులో ఉంచండి. మీరు తెచ్చిన కలెక్షన్ చూసేందుకు మీ స్నేహితులు, పొరుగువారు, బంధువులను పిలవండి. ఇంట్లోనే ఉంటూ చీరలు విక్రయించాలనుకుంటే దానికి ఏకైక, ఉత్తమ మార్గం నోటి ప్రచారం.
నిజానికి ఇంట్లో ఉండే గృహిణులకు ఆర్థికంగా స్వతంత్రులుగా మారడానికి చీరల దుకాణం సులభమైన ఆదాయ మార్గం. మనలో చాలా మంది చీరల బిజినెస్ అనగానే ఇది వర్కవుట్ కాదులే అని సింపుల్ గా పట్టించుకోకుండా ఉంటారు. కానీ ఒకసారి మీరు మార్కెట్ లో గమనించినట్లయితే చీరల బిజినెస్ లో లక్షలు గడిస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. ఇప్పటికైనా పోయింది లేదు.. ఇంట్లో ఖాళీగా ఉండటం కన్నా ఆర్థిక స్తోమతను బట్టి ఎంతో కొంత మొత్తంతో ఈ వ్యాపారం ప్రారంభించండి. ఈ వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు మరిన్ని మెళుకువల కోసం కింది ఈ వీడియో చుడండి.