ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. కొందరు మంచి ఉద్యోగంతో మంచి జీతం పొందాలని కోరుకుంటారు. ఇంకొందరు సొంతంగా వ్యాపారం ప్రారంభించి.. సమాజంలో ఓ గొప్ప బిజినెస్ మెన్ గా మారాలని భావిస్తారు. అలాంటి వారిలో ఎవరైన పెట్రోల్ బంక్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా?. పెట్రోల్ బంక్ బిజినెస్ లో వచ్చే ఆదాయం తెలిస్తే మీరు షాకవుతారు.
ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. కొందరు మంచి ఉద్యోగంతో మంచి జీతం పొందాలని కోరుకుంటారు. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని అనుకుంటారు. ఇంకొందరు సొంతంగా వ్యాపారం ప్రారంభించి.. సమాజంలో ఓ గొప్ప బిజినెస్ మెన్ గా మారాలని భావిస్తారు. అందులో భాగంగానే చాలా మంది వివిధ రకాల వ్యాపారాలు చేస్తుంటారు. కొందరు ఏం బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తుంటారు. అయితే ఇంధన రంగంలో వ్యాపారం చేయాలనుకునే వారికి పెట్రోల్ పంప్ బిజినెస్ మంచి లాభదాయకంగా ఉంటుంది. అలానే మన దేశంలో పెట్రోల్ డిమాండ్ కూడా బాగా ఉంది. మరి.. ఈ వ్యాపారం చేయాలనుకునే వారు లైసెన్స్ ఎలా పొందాలి.. ఎంత పెట్టుబడి అవుతుంది ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నేటికాలంలో చాలా మంది వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలానే కొందరు పెట్రోల్ బంక్ ను నిర్వహించాలను కుంటారు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలపై అవగాహన లేక కాస్తా వెనుకడు వేస్తున్నారు. అయితే ఈ పెట్రోల్ బంక్ వ్యాపారం నిర్వహించడానికి కొన్ని అర్హతలును ప్రభుత్వం నిర్ణయించింది. 21 ఏళ్ల వయస్సు నిండిన వారు పెట్రోల్ బంక్ తెరిచేందుకు అర్హులు. అదే విధంగా 55 ఏళ్ల లోపు వారు మాత్రమే ఉండాలి. విద్యార్హత విషయానికి వస్తే.. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఇక పెట్రోల్ బంక్ నిర్వహణ కోసం దరఖాస్తు చేసే వ్యక్తికి.. రిటైల్ అవుట్ లేట్ లేదా ఇతర వ్యాపారాల్లో కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. ఈ దరఖాస్తుదారుడికి నేర చరిత్ర ఉండకూడదు. ఏదైనా వ్యాపార రుణానికి సంబంధించి డీఫాల్టర్‌గా ఉండకూడదు. తన ఫ్యామిలీ మొత్తం సంపద కలిపి రూ.50 లక్షలకు మించకూడదు. ఇక పెట్రోల్ బంక్ కోసం భూమిని కలిగి ఉండాలి. భూమి విషయంలో చట్టపరంగా ఎలాంటి వివాదాలు ఉండకూడదు. రూరల్ ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ తెరవాలంటే.. సింగిల్ డిస్పెన్సింగ్ యూనిట్ కు 800 చ.మీ స్థలం అవసరమవుతుంది. అలానే రెండు సిప్పెన్సింగ్ యూనిట్లకు 1200 చ.మీ స్థలం కావాలి. అలానే పట్టణ ప్రాంతాల్లో అయితే 500 చ.మీ మీటర్లు, 800 చ.మీ స్థలం అవసరం అవుతుంది.
ఇక పెట్టు పడి విషయానికి వస్తే.. స్థలం, నిర్మాణం, వస్తువుల ఖర్చులతో పాటు లైసెన్సింగ్ ఫీజులు వంటివి ఉంటాయి. భూమి ఖరీదు ప్రాంతం బట్టి ఉంటుంది. ఇక బంక్ నిర్మాణం ఖర్చు..డిజైన్, వస్తువులను బట్టి.. రూ.30 లక్షల నుంచి కోటి వరకు పడుతుంది. అలానే పెట్రోల్ బంక్ మెటీరియల్ ఖర్చు రూ.20 నుంచి 50 లక్షల వరకు అవుతుంది. లైసెన్స్ ఫీజుల కింద రూ.2 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఎస్సార్, రిలయన్స్ వంటి ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు.. పెట్రోల్ బంక్ ల లైసెన్స్ జారీ చేస్తాయి. పెట్రోల్, డీజిల్‌పై కమీషన్ రూపంలో ఆదాయం ఉంటుంది. ఇది ఒక్కో కంపెనీని బట్టి మారుతుంది.
ప్రస్తుతానికి ప్రతి పెట్రోల్ పంప్ డీలర్.. సగటున లీటర్ పెట్రోల్‌పై రూ.3 పైనే లాభం పొందుతున్నాడు. అలానే ఈ బిజినెస్ ద్వారా మంచి ఆదాయం వస్తుంది. ఇంక పెట్రోల్ బంక్ వ్యాపారానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం https://www.petrolpumpdealerchayan.in/ చూడండి. అందులో పెట్రోల్ బంక్ లకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఈ ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఖర్చు కూడా ప్రాంతాలను బట్టి మార్పులు ఉంటుంది. రూరల్ ప్రాంతాల్లో రూ.100, మెట్రోపాలిటన్ నగరాల్లో రూ.1000 వరకు ఉంటుంది.
ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఓబీసీ కేటగిరీలకు చెందిన వారికి అప్లికేషన్ ఫీజులో 50 శాతం తగ్గింపు ఉంటుంది. మీకు లైసెన్స్ వచ్చిన తరువాత టాక్స్ చెల్లించేందుకు జీఎస్టీ కింద మీ పేరు నమోదు చేసుకోవాలి. అలానే పెట్రోల్ పంప్ ఆపరేషన్ పేరిట కొత్తగా బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయాలి. ఇలా పెట్రోల్ బంకు వ్యాపారం ద్వారా మంచి లాభాలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. మరి.. ఈ బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.