ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వారు అంటూ ఎవరూ లేరు. అయితే.. సిమ్ కార్డు లేకుండా మనం మొబైల్ వాడాలంటే కష్టమే. ఎందుకంటే.. ఎవరికైనా కాల్ చేయాలన్నా.. మెసేజ్ చేయాలన్న మనకి కానీ వారికి కానీ కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. కొందరు తరచూ ఫోన్‌లకు కొత్త సిమ్ కార్డులు కొంటూ ఉంటారు. కొన్ని రోజులు వినియోగించిన తర్వాత పక్కన పడేస్తారు. మళ్లీ కొత్తవి తీసుకొని వాడతారు. ఇలా ఒక్కక్కరి పేరు మీద ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయి. అసలు తమ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నారో కూడా వారికి గుర్తుండదు. తాజాగా సిమ్ కార్డుల ఎన్ని తీసుకోవచ్చు అన్న విషయంపై టెలీకమ్యూనికేషన్ శాఖ (డాట్) కీలక ప్రకటన చేసింది.
సాధారణం గా మనం సిమ్ తీసుకోవాలంటే తప్పనిసరిగా మన గుర్తింపు అయినా ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన నెంబర్ కచ్చితంగా ఆధార్ కు లింక్ అవుతుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ప్రకారం, ఒక వ్యక్తి తమ ఆధార్ నంబర్‌ను సమర్పించి 18 కొత్త సిమ్ కార్డ్‌లను తీసుకోవచ్చు. అయితే ప్రభుత్వం సాధారణ ఫోన్ కమ్యూనికేషన్ కోసం 9 సిమ్ కార్డులను అనుమతించింది. మిగిలిన 9 సిమ్ కార్డులను M2M కమ్యూనికేషన్ కోసం ఉపయోగించవచ్చు.
ఇది కూడా చదవండి: మనం ఫ్రీగా ఉపయోగించే వాట్సాప్ కి డబ్బులు ఎలా వస్తాయో తెలుసా?ఒక వినియోగదారుడి పేరు మీద 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డులుంటే వెరిఫికేషన్ చేసుకోవాలని ఆదేశించింది. అలా చేసుకోని వారి అదనపు కనెక్షన్లు డీ యాక్టివేట్ చేయాలని టెలికాం ఆపరేటర్లకు డాట్ సూచించింది. వేటిని యాక్టివ్ గా ఉంచుకోవాలి, వేటిని తీసేసుకోవాలన్నది వినియోగదారుడి ఇష్టం. అదే అసోం, జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు సిమ్ కార్డుల పరిమితిని ఆరుగా నిర్ణయించింది.
మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసుకోవడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
ఇది కూడా చదవండి: రక్తంలోనూ ప్లాస్టిక్ మహమ్మారి.. తొలిసారి అంటున్న శాస్త్రవేత్తలు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.