ఇల్లు కట్టుకోవాలంటే కనీసం ఎంత స్థలం ఉండాలి. 1 బీహెచ్కే, 2 బీహెచ్కే ఫ్లాట్ కి కనీస స్థలం ఎంత ఉండాలి? అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ ఆర్టికల్.
ఇల్లు లేదా ఫ్లాట్ పేరు ఏదైనా గానీ ఉండడానికి ఒక జాగా ఉన్నవారిని ఈ లోకం గొప్పగా చూస్తుంది. లోకం సంగతి పక్కన పెడితే ఎవరికి వారే గొప్పగా ఫీలవుతారు. ఎందుకంటే సొంతిల్లు ఉన్నవారు రాజుతో సమానం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేటకు వెళ్లి తిరిగొచ్చిన రాజు కోసం ఒక సామ్రాజ్యం ఎదురుచూస్తున్నట్టు.. మన కోసం కూడా ఒక మాహిష్మతి సామ్రాజ్యం లాంటి ఇల్లు ఎదురుచూస్తుంటుంది. మాహిష్మతి కాకపోతే కుంతల రాజ్యం. ఏదైనా గానీ ఎవరి ఇల్లు వారికే విశాల సామ్రాజ్యం, ఎవరింటికి వారే రాజు. మరి ఉన్నంతలో గొప్పగా ఇల్లు కట్టుకోవాలంటే కనీస స్థలం ఎంత ఉండాలి? ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎంత స్పేస్ లో కట్టుకోవచ్చు? 1 బీహెచ్కే, 2 బీహెచ్కే, 3 బీహెచ్కే ఫ్లాట్లకు ఎంత స్థలం ఉండాలి?
ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్ కలిగిన 1 బీహెచ్కే ఇల్లు కట్టుకోవడానికి కనీసం 400 నుంచి 500 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఈ జాగాలో ఇల్లు కట్టుకుంటే చిన్న కుటుంబానికి, దిగువ మధ్యతరగతి కుటుంబానికి సరిపోతుంది. హాల్ ని తమ పిల్లల కోసం చిన్న బెడ్ రూమ్ గా కూడా మార్చుకోవచ్చు. ఇక 2 బీహెచ్కే కోసం ఐతే 650 చదరపు అడుగుల నుంచి 800 చదరపు అడుగుల స్థలం కావాలి. 3 బీహెచ్కే ఫ్లాట్ లేదా ఇంటికి 900 నుంచి 1100 చదరపు అడుగుల స్థలం, 4 బీహెచ్కేకి ఐతే 1300 నుంచి 1700 చదరపు అడుగుల స్థలం ఉండాలి.
1 బీహెచ్కే ఫ్లాట్ లేదా ఇంటికి కనీసం 450 నుంచి 600 చదరపు అడుగుల స్థలం ఉండాలి. స్టాండర్డ్ సైజ్ అయితే 450 నుంచి 600 చదరపు అడుగులు, అదే కనీసం ఉండాల్సిన సైజ్ అయితే 400 చదరపు అడుగులు. 2 బీహెచ్కేకి ఐతే స్టాండర్డ్ సైజ్ 650 నుంచి 800 చదరపు అడుగులు ఉండాలి. కనీసం ఐతే 650 చదరపు అడుగులు ఉండాలి. 3 బీహెచ్కే ఫ్లాట్ లేదా మూడు బెడ్ రూముల ఇంటికి స్టాండర్డ్ సైజ్ 900 నుంచి 1100 చదరపు అడుగులు ఉండాలి. కనీస సైజ్ ఐతే 900 చదరపు అడుగులు ఉండాలి. 4 బీహెచ్కే ఫ్లాట్ కైతే స్టాండర్డ్ సైజ్ వచ్చేసి 1300 నుంచి 1700 చదరపు అడుగులు ఉంటుంది. కనీస సైజ్ ఐతే సింగిల్ ఫ్లోర్ కి 1300 చదరపు అడుగులు, రెండు ఫ్లోర్లు అయితే 650 చదరపు అడుగులు కావాలి. బిల్డింగ్ నియమాల ప్రకారం ఇంటి చుట్టూ నాలుగు వైపులా కనీసం ఓపెన్ స్పేస్ ఖాళీగా వదిలేయాల్సి ఉంటుంది. డ్రైనేజీ వర్క్ కి, సెప్టిక్ ట్యాంక్ కి, వాటర్ ట్యాంక్ వంటి వాటికి ఉపయోగపడుతుంది. అలానే అగ్నిమాపక ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడుతుంది.