తమకంటూ ఓ సొంతిళ్లు ఉండాలన్నది ప్రతీ వారి కల. అందుకోసం అహర్నిశలూ కష్టపడుతుంటారు. అయితే, ఇళ్లు కట్టడం లేదా కొనడం అన్నది అంత తేలికైన విషయం కాదు. చాలా డబ్బు, శ్రమతో కూడుకున్నది. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే సిమెంట్, ఇసుక, ఇటుక.. ఇలాంటి వాటి ధరలు భారీగా పెరిగాయి. ఎంత సింపుల్ గా ఇంటి నిర్మాణం చేయాలన్నా లక్షల్లోనే ఖర్చు అవుతుంది. ఇక అదే హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో అయితే ఖర్చు మరింత ఎక్కువ. అందుకే కొంతమంది కలలతోనే బతికేస్తుంటారు. అలాంటి వారి కోసం ఓ చక్కని ఉపాయం అందుబాటులో ఉంది. అలా చేయడం ద్వారా డబ్బులు లేకపోయినా సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు.
‘బిల్డర్స్..’ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వీరి గురుంచే. చేతిలో రూపాయి లేకపోయినా ఆకాశహర్మాలు నిర్మిస్తుంటారు. ఇలా చేయడమన్నా అంత తేలికైన పని కాదు. ఎంతో రెప్యుటేషన్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. మనకంటూ ఓ సొంతిల్లు ఉండాలి. ఇది మన కల. స్థలమైతే ఉంది కానీ, డబ్బులేవు. ఇలాంటి పరిస్థితిల్లో మనం బిల్డర్స్ సహకారం తీసుకోవాలి. మన ల్యాండ్.. వారి డబ్బును పెట్టుబడిగా పెట్టి సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. దీన్నే డెవలప్ మెంట్ అగ్రిమెంట్ అంటారు. మరి అదెలా సాధ్యం? మరిన్ని పూర్తి వివరాల కోసం ఈ కింది వీడియోను చూడండి.