సామాన్యులకు ఉండే అతి పెద్ద కల.. సొంతింటి నిర్మాణం. మరి నేటి కాలంలో ఇంటి నిర్మాణం ఎంత భారంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నెలకు కేవలం 10 వేల రూపాయలు పక్కకు పెట్టుకుంటే.. సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలానో వారి మాటల్లోనే..
మనిషికి ఉండే కలల్లో సొంతింటి నిర్మాణం ముందు వరుసలో ఉంటుంది. తాను మృతి చెందిలోపు.. చిన్నదో, పెద్దదో తనకంటూ సొంతంగా ఓ ఇల్లు ఉండాలని కలలు కంటాడు. అయితే నేటి కాలంలో ఇంటి నిర్మాణం ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్నింటి ధరలు భారీగా పెరగడంతో.. ఇంటి నిర్మాణం పెను భారంగా మారింది. పల్లెల్లో సాదాసీదాగా ఇంటి నిర్మాణం చేపడితేనే లక్షల్లో ఖర్చవుతుంది. అలాంటిది సిటీల్లో అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తక్కువలో తక్కువ అంటే మినిమం 30 లక్షలు ఖర్చు చేయంది ఇల్లు రాదు. కానీ పేదలు, మధ్యతరగతి వారికి ఇది చాలా పెద్ద మొత్తం. ఒకేసారి 30 లక్షలు ఖర్చు చేసి ఇల్లు తీసుకోవడం అంటే మాములు విషయం కాదు. చాలా మంది దగ్గర అంత పెద్ద మొత్తం ఒకేసారి ఉండదు కూడా. మరి దీనికి పరిష్కారం లేదా అంటే.. ఉంది అంటున్నారు మార్కెట్ నిపుణులు. వారి మాటల్లోనే..
భార్యాభర్తలిద్దరి నెలవారి ఆదాయం సుమారు 40 వేల రూపాయలు ఉంటే.. వారు తాము ఉండే టౌన్‌లోనే 30 లక్షల రూపాయలు విలువ చేసే ప్లాట్ కొనుక్కొవచ్చు అంటున్నారు. ఇద్దరి ఆదాయం కలిపి 40 వేల రూపాయలు ఉంటే.. వారి మీద భార్య, పిల్లల బాధ్యత మాత్రమే ఉంటే.. అలాంటి వారు ఇల్లు కొనగలరు అంటున్నారు. దీనికి ముందు మీరు చేసే జాబ్‌కి గ్యారంటీ ఉంటుందా.. అన్నది ఆలోచించుకోవాలి అని చెబుతున్నారు. ఆ తర్వాత మీకు లోన్ ఎంత వస్తుంది అనేది తెలుసుకోవాలి. గ్రాస్ సాలరీలో సగం ఈఎంఐ కట్టుకోవాల్సి ఉంటుంది అంటున్నారు.
హోమ్‌లోన్ తీసుకోవాలని భావిస్తే.. వేరే ఈఎంఐలు ఉండకూడదు. సిబిల్ బాగుండాలి అంటున్నారు. అలానే హౌస్ లోన్ ఈఎంఐ అనేది ఎన్ని ఏళ్ల పాటు ఉంటే కస్టమర్‌కు కలిసి వస్తుంది అనే విషయాలను కూడా తెలిపారు. ఇక్కడ మీరు చెల్లించే హోమ్ లోన్‌లో సగం ఎమౌంట్ మీరు కట్టే ఇంటి అద్దె ఉంటుంది. మీ మీద పడే భారం కేవలం 10 వేల రూపాయలు మాత్రమే ఉంటుంది అంటున్నారు నిపుణులు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.