భారత సంతతి వ్యాపారవేత్త, హిందూజ గ్రూప్ ఛైర్మన్ ఎస్‌పీ హిందూజ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ప్రముఖ వ్యాపారవేత్త, హిందూజ గ్రూప్ ఛైర్మన్ శ్రీచంద్ పర్మానంద్ హిందూజ(87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం లండన్‌లో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వయస్సు 87 ఏళ్లు. హిందుజా సోదరులు నలుగురు కాగా, శ్రీచంద్ పర్మానంద్ అందరిలో పెద్దవారు. గోపీచంద్, ప్రకాష్, అశోక్ హిందూజాలు ఈయన సోదరులు.
ఎస్‌పీ హిందూజ 1935 నవంబర్ 28న బ్రిటిష్ ఇండియాలోని సింధ్ ప్రావిన్స్‌లోని కరాచీలో జన్మించారు. చిన్న వయస్సులోనే తండ్రి తో కలిసి వ్యాపార కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన హిందూజా గ్రూప్ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. హిందూజా గ్రూప్ భారత్ సహా పలు దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. ఎస్‌పీ హిందూజా సోదరులు గోపీచంద్ హిందూజా, ప్రకాశ్ హిందూజా, అశోక్ హిందూజా కూడా హిందూజా గ్రూప్ వ్యాపార కార్యకలాపాల్లో కీలక హోదాల్లో ఉన్నారు.
Chairman of #Hinduja Group Srichand Parmanand Hinduja died in London following an illness.
He was a British passport holder. 87-year-old business tycoon was the eldest of the four brothers. SP Hinduja and his brothers Gopichand and Prakash were accused of receiving around 81… pic.twitter.com/K6mSATVRNN
— All India Radio News (@airnewsalerts) May 17, 2023