నిత్యం వ్యాపార వ్యవహారాల్లో తలమునకలై బిజీ జీవితాన్ని గడిపే ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా.. ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంటారు. ఆయన జీవిత అనుభవాలతో పాటు సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే.. ఈసారి అయన కళ్లు.. ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ల ప్రేమ వ్యవహారంపై పడింది. నరేంద్ర మోడీ, లలిత్ మోడీ, నీరవ్ మోడీలలోని.. మోడీ పేరును ఒకే తాటిపైకి చేర్చి.. వారికి ఏమేం కావాలో చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, లలిత్ మోడీ, విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీల ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆయన ‘ ఒక మోడీ (ప్రధాని)కి ఇండియా కావాలి. మరో మోడీ (లలిత్)కి మిస్ ఇండియా కావాలి. ఇంకో మోడీ (నీరవ్) ఇండియాకే కావాలి’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సెటైరికల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
One Modi wants India
One Modi wants Miss India
One Modi is wanted in India pic.twitter.com/kKZLjp3LsA— Harsh Goenka (@hvgoenka) July 16, 2022
కాగా, ఐపీఎల్‌లో మనీల్యాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్న లలిత్ మోడీ.. 2010లో ఇండియా నుంచి పరారీ అయ్యాడు. అప్పటి నుంచి అతను లండన్‌లోనే ఉంటున్నాడు. ఇక.. పీఎన్‌బీ కుంభకోణం కేసులో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఫన్నీ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Just back in london after a whirling global tour #maldives # sardinia with the families – not to mention my #better looking partner @sushmitasen47 – a new beginning a new life finally. Over the moon. 🥰😘😍😍🥰💕💞💖💘💓. In love does not mean marriage YET. BUT ONE THAT For sure pic.twitter.com/WL8Hab3P6V
— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022
ఇది కూడా చదవండి: పిల్లల కోసం పొదుపుచేయాలనే వారికి గుడ్ న్యూస్.. రూ. 32 లక్షలు పొందే ప్రయోజనం!
ఇది కూడా చదవండి: కరెన్సీ నోటుపై ఈ సీరియల్ నెంబర్ ఉంటే రూ.3 లక్షలు మీవే!