ఖరీదైన లగ్జరీ బైక్ లుగా పేరుగాంచిన హార్లీ డేవిడ్ సన్ అతి చౌకైన ధరలో ఓ బైక్ ను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేసింది. స్టైలిష్ లుక్ తో అద్భుతమైన ఫీచర్స్ తో హార్లీ డేవిడ్ సన్ ఎక్స్440 అనే బైక్ ను విడుదల చేసింది.
ఆటోమొబైల్ రంగంలో ఆధునిక టెక్నాలజీతో, నూతన డిజైన్లతో టూ వీలర్స్ ను కంపెనీలు మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. యువతను ఆకట్టుకునేలా బైక్ లను రూపొందించి రక రకాల మోడల్స్ ను లాంచ్ చేస్తున్నాయి. కుర్రాళ్లు ఎక్కువగా బైక్ లను ఇష్టపడుతుంటారు. లగ్జరీ బైక్ ల విషయంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. లగ్జరీ బైక్ అయిన హార్లీ డేవిడ్ సన్ బైక్ అంటే యువతలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ బైక్ ధర కూడా లక్షల్లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హార్లీ డేవిడ్ సన్ అద్భుతమైన ఫీచర్స్ తో, ఆకట్టుకునే లుక్ తో ఓ బైక్ ను మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ధర కూడా అందుబాటులో ఉండే విధంగా రూపొందించింది. ధర తెలిస్తే మీరు కొనడానికి వెనకాడరు. హార్లీ డేవిడ్ సన్ బైక్ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఖరీదైన బైకులుగా పేరుగాంచిన హార్లీ డేవిడ్ సన్ ఊహించని రీతిలో చాలా తక్కువ ధరకే ఎక్స్440 బైక్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. హార్లీ డేవిడ్ సన్ నుంచి వస్తున్న చౌకైన బైక్ ఇదే. మూడు వేరియంట్లలో ఈ బైక్ అందుబాటులో ఉండనున్నది. ఇండియాలో ఎక్స్ షోరూం ధరల ప్రకారంగా వీటి ధరలు చూస్తే డెనిమ్ వేరియంట్ ధర రూ. 2.29 లక్షలు, వివిద్ వేరియంట్ ధర రూ. 2.49 లక్షలు, ఎస్ వేరియంట్ ధర రూ. 2.69 లక్షల్లో హార్లీ డేవిడ్ సన్ ఎక్స్440 బైక్స్ లభ్యం కానున్నాయి.
స్టైలిష్ లుక్ తో, బేస్ వేరియంట్ వైర్ స్పోక్ రిమ్స్, మినిమల్ బ్యాడ్జింగ్ కలిగా ఉంటుంది. 3డి బ్యాడ్జింగ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో కలర్ టిఎఫ్ టి డాష్, నావిగేషన్ ఫీచర్స్ తో ఎక్స్440 బైక్ రూపొందించబడింది. హీరో మోటార్ కార్ప్ తో కలిసి ఈ బైక్ ను రూపొందించింది. ఈ బైక్‌లో 440 సిసి సింగిల్ సిలిండర్, ఆయిల్- ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. యూఎస్డీ ఫ్రెంట్ ఫోర్క్స్, రేర్‌లో ట్విన్ షాక్ అబ్సార్బర్స్‌తో పాటు డిస్క్ బ్రేక్స్, డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ వంటి ఫీచర్స్ ఈ హార్లీ డేవిడ్సన్ ఎక్స్440లో ఉంటాయి.