ఉద్యోగులకు సరిపడా జీతం ఇవ్వకుండా వారిని యంత్రాల్లా వాడుకునే బాసులు కొందరైతే.. బానిసలుగా చూసే బాసులు మరికొందరు. అలాంటి బాసులకు విభిన్నమైన బాస్ మరొకరు ఉద్యోగ ప్రపంచంలోకి ఒకరొచ్చారు. ఆయన ఎవరో కాదు.. సీటెల్ ఆధారిత గ్రావిటీ చెల్లింపుల కంపెనీ సీఈఓ డాన్ ప్రైస్. ఇన్నాళ్లు ఉద్యోగులను బానిసలుగా, యంత్రాలాగా చూశాం.. ఇప్పుడు అలా వద్దు. వారు చేసే పనికి కేవలం జీతం ఇస్తే సరిపోదు, తగిన గౌరవం కూడా ఇవ్వాలని చెప్తున్నాడు. ఈ విషయాన్నే ట్విటర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
బాస్ అంటే ఇలా ఉండాలి..
అమెరికా, సీటెల్ ఆధారిత కంపెనీ గ్రావిటీ సీఈఓ ప్రైస్.. తన ఉద్యోగుల కనీస జీతం.. 80,000 డాలర్లు అంటే రూ. 63.7 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులు వారికి నచ్చిన ప్రదేశం నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించారు. ఇంకా చెప్పాలంటే ఉద్యోగుల సౌకర్యాల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు.
ఒక కంపెనీ ఉన్నతంగా నిలబడాలంటే.. ఉద్యోగులే ఊపిరి.అలాంటి వారికి జీతం మాత్రమే ఇస్తే సరిపోదని, వారిని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉండాలంటున్నాడు. తమ కంపెనీలో ఒక్కో ఉద్యోగానికి తమకు 300కు పైగా అప్లికేషన్స్ వచ్చాయని తెలిపాడు. ఉద్యోగులకు సరైన వేతనం, గౌరవం దక్కని చోట పనిచేయాలని ఏ ఒక్కరూ అనుకోరని తెలిపాడు. ఈ ట్విట్ పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే నెటిజన్లు పెద్దసంఖ్యలో స్పందించారు. మీలాంటి బాస్ ఆధ్వర్యంలో పని చేయడం ఉద్యోగుల అదృషమని నెటిజన్స్ కామెంట్స్ చేశారు.
My company pays an $80k min wage, lets people work wherever they want, has full benefits, paid parental leave, etc.
We get over 300 applicants per job.
“No one wants to work” is a hell of a way of saying “companies won’t pay workers a fair wage and treat them with respect.”
— Dan Price (@DanPriceSeattle) August 8, 2022
ఇదీ చదవండి: Labour Codes: అమల్లోకి రానున్న కొత్త లేబర్ చట్టాలు.. వారానికి 4 రోజులు పని.. 3 రోజులు సెలవులు?
ఇదీ చదవండి: Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఈ ఏడాది జీతం ఎంతంటే?