భవిష్యత్ భద్రంగా ఉండాలంటే ఆర్థిక ముందుచూపు అవసరం. అలా భవిష్యత్ అవసరాల కోసం డబ్బు పొదుపు చేయాలనుకునే వారికోసం దేశంలో అనేక పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనవి మరియు అధిక వడ్డీని అందించేవి.. పోస్ట్ ఆఫీస్ పథకాలు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కనుక డబ్బుల గురుంచి చింత అక్కర్లేదు. ప్రైవేట్ సంస్థలు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల కంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న పొదుపు పథకాల్లోదాచుకునే డబ్బులు సురక్షితంగా ఉంటాయన్నది వాస్తవం. రిటర్న్స్ కాస్త తక్కువగా ఉన్న మీ డబ్బుకు భరోసా ఉంటుంది. అలాంటి పొదుపు పథకాల్లో ‘గ్రామ సురక్ష యోజన’ ఒకటి. ఈ స్కీమ్‌లో రోజుకు రూ.50 పొదుపు చేస్తూ పోతే మెచ్యూరిటీ సమాయానికిదాదాపు రూ.35 లక్షలు మీ చేతికొస్తాయి. ఈ పథకంలో ఎలా చేరాలి..? ప్రీమియం ఎంత ఉంటుంది..? ఏజ్ లిమిట్ ఎంత..? వంటి పూర్తి వివరాలు మీకోసం..
‘గ్రామ సురక్ష యోజన‘ అనేది హోల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ. ఇది పోస్టాపీసులో అందుబాటులో ఉంది. 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఈ పథకంలో భాగంగా పెట్టుబడి పెట్టే కనీస మొత్తం రూ. 10వేల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికి ఓసారి ప్రీమియం చెల్లించొచ్చు. ప్రీమియం చెల్లించడానికి పాలసీదారులకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ పథకంలో 55, 58, 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించవచ్చు. ఈ పథకం కింద రుణ సదుపాయం కూడాఉంది. ఒకవేళ ఈ పథకంలో కొనసాగడం ఇష్టం లేదు అనుకుంటే మూడేళ్ల తర్వాత పాలసీ నుంచి ఉపసంహరించుకోవచ్చు. అయితే.. అలాంటి పరిస్థితుల్లో కస్టమర్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.
ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఈ పథకంలో 19 ఏళ్ల వయసులో 10 లక్షల బీమాతో కూడిన సురక్ష పాలసీని కొనుగోలు చేశాడనుకుంటే.. 55 సంవత్సరాల వరకు నెలవారీ ప్రీమియం రూ.1515 చెల్లించాలి. మెచ్యూరిటీ తర్వాత రూ. 31.60 లక్షలు పొందుతారు. అదే, 60 ఏళ్లపాటు ప్రతి నెలా రూ.1411 ప్రీమియం చెల్లిస్తే.. మెచ్యూరిటీ అనంతరం రూ.34.60 లక్షలు మీ చేతికి అందుతాయి. ఒకవేళ కాలవ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే.. ఈ మొత్తాన్ని నామినీకి అందిస్తారు. రోజుకు రూ. 50 అన్న పొదుపు అంటే నెలకు రూ.1,500. మధ్యతరగతి వారికైనా.. ఇది పెద్ద మొత్తం కాకపోవచ్చు. కావున ఇలాంటి ఏదేని అధిక రాబడి అందించే పథకంలో మీరు పెట్టుబడి ప్రారంభించండి. ఈ పథకం మీకు ఉపయోగకరమైనదని భావిస్తే.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.