ప్రముఖ వ్యాపారవేత్త, దాత, టెక్ దిగ్గజం ఇంటెల్ కో-ఫౌండర్ కన్నుమూశారు. ఆయన మృతిపై వ్యాపార వర్గాలు నివాళులు అర్పిస్తున్నాయి.
సిలికాన్ వ్యాలీ దిగ్గజం, ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ సహ వ్యవస్థాపకుడు గోర్డన్ మూర్ (94) కన్నుమూశారు. శనివారం హవాయిలోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. మూర్ మృతికి ఇంటెల్ కార్పొరేషన్ నివాళులు అర్పించింది. ఆయన సేవలు చిరస్మరణీయం అని కొనియాడింది. గొప్ప విజనరీని మనం కోల్పోయామంటూ ట్వీట్ చేసింది. మూరే మృతికి వ్యాపార వర్గాలు నివాళులు అర్పించాయి. ఆయన దూరదృష్టి హైటెక్ యుగానికి వేదికైంది అంటూ మెచ్చుకున్నాయి. ఇక, 1950 దశకంలో సెమీకండక్టర్ల బిజినెస్‌ను మొదలుపెట్టారు మూర్. ఆ తర్వాత ఇంటెల్ కార్పొరేషన్ కంపెనీని ఆయన స్థాపించారు. ప్రతి ఏడాది కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్ రెట్టింపు అవుతుందని మూర్ ముందే అంచనా వేశారు. సెమీకండక్టర్స్ బిజినెస్ కోసం మూర్ ఆ రోజుల్లోనే కొత్త రూల్స్ రూపొందించారు.
కంప్యూటర్ ప్రాసెసర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు గోర్డన్ మూర్. పీసీ రెవల్యూషన్‌లో ఆయన పాత్ర చాలా ప్రత్యేకమైనది. మెమొరీ చిప్స్ రూపకల్పనలోనూ మూర్ తనదైన ముద్ర వేశారు. మరో విశేషం ఏమిటంటే.. 1990ల నాటికి వరల్డ్‌వైడ్‌గా ఉత్పత్తయిన 80 శాతం కంప్యూటర్లలో ఇంటెల్ మైక్రోప్రాసెసర్లే ఉండేవి. ఇకపోతే, వ్యాపారాన్ని పక్కనబెడితే.. దాతృత్వంలో మూర్ ముందుండేవారు. భార్య బెట్టీతో కలసి ఆయన విస్తృతంగా దానాలు చేశారు. 2001లో వీళ్లిద్దరూ కలసి బెట్టీ మూర్ ఫౌండేషన్‌ను స్థాపించారు. 175 మిలియన్ ఇంటెల్ షేర్లను ఈ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. అలాగే 2001లో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 600 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇచ్చారు.
Today, we lost a visionary.
Gordon Moore, thank you for everything. pic.twitter.com/bAiBAtmd9K
— Intel (@intel) March 25, 2023