దిగ్గజ టెక్ కంపెనీలు వరుసబెట్టి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తీసేస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేఆఫ్స్ చేసినా.. ఆ సంస్థలకు ఊరట దక్కడం లేదు. పైగా కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలన్నీ లేఆఫ్స్ బాట పట్టాయి. ఆర్థిక మాంద్యం భయాలతో బడా సంస్థలు కూడా ఉద్యోగులను తొలగిస్తూ పోతున్నాయి. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను క్రమంగా పెంచుకుంటూ పోవడం కూడా దీనికి ఊతమిస్తోంది. ఎంప్లాయీస్‌ను తీసేస్తున్న సంస్థల్లో మెటా, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, సహా గూగుల్ కూడా ఉంది. గూగుల్ ఇటీవలి కాలంలో సామూహిక లేఆఫ్స్‌ను ప్రారంభించింది. ఈ కంపెనీ ఏకంగా 10 వేలకు పైగా ఉద్యోగులను తొలగించింది. అయితే లేఆఫ్స్ తర్వాత గూగుల్‌కు తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలగించిన ఎంప్లాయీస్‌కు భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి రావడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
సాధారణంగా గూగుల్ లాంటి బడా టెక్ సంస్థల్లో ఉద్యోగులను తీసేసిన తర్వాత వారికి విభజన చెల్లింపు కింద శాలరీ ఇవ్వాలి. దీనికి సంబంధించి జాబ్‌లో చేరేముందు అగ్రిమెంట్ కూడా ఉంటుంది. ఇది దేశాలను బట్టి, అక్కడి రూల్స్‌ను బట్టి మారుతూ ఉంటుంది. ఇదే ఇప్పుడు గూగుల్‌కు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. విభజన చెల్లింపులో భాగంగా కొందరు గూగుల్ ఎంప్లాయీస్ ఏకంగా రూ.2.68 కోట్ల మేర పరిహారం అందుకోనున్నారు. ఐర్లాండ్‌లోని గూగుల్ ఉద్యోగులు అత్యధికంగా 3 లక్షల యూరోల (భారత కరెన్సీలు సుమారుగా రూ.2.68 కోట్లు)ను విభజన చెల్లింపు కింద అందుకోనున్నారట. ఇటీవల గూగుల్ తీసేసిన వారిలో ఐర్లాండ్‌లోని ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోంది. వీరు జాబ్ కోల్పోయినా పరిహారం కింద భారీ రూపంలో నగదును అందుకోనున్నారని సండే టైమ్స్ నివేదించింది.
Google announced mass layoffs in January this year, however some employees in Ireland who got the pink slip, could receive more than €300,000 (Rs 2.68 crore) in severance, Sunday Times reported
Read here👇https://t.co/oVfm0X2ln0#Layoffs #Jobs
— Moneycontrol (@moneycontrolcom) March 31, 2023