‘కాల్ రికార్డింగ్ యాప్‘.. దీని గురుంచి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న అందరకి ఈ యాప్ సుపరిచితమే. ఏం లేదండీ.. ‘ఎవరితోనైనా కాల్ లో సంభాషిస్తున్నప్పుడు అవసరమనుకుంటే ఆ మాటలను రికార్డింగ్ చేయడమన్నమాట‘. ఈ యాప్ వాడుతున్న వారందరకి గూగుల్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించనున్నట్లు పేర్కొంది. యాజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందన్న కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటినీ నిలిపేయాలని గూగుల్ నిర్ణయించింది. మే 11 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
‘కాల్ రికార్డింగ్ ఆప్షన్’ పై గూగుల్ ఎల్లప్పుడూ వ్యతిరేక స్వరాన్నే వినిపించింది. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా ఫోన్‌లో వారి వాయిస్‌ను రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందన్నది గూగుల్ అభిప్రాయం. అందులో భాగంగానే కాల్ రికార్డింగ్ యాప్స్‌ను తొలగించేందుకు సిద్ధమైంది. మే 11 నుంచి గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటిపై నిషేధం విధించనుంది. ఈ బ్యాన్ మే 11 నుంచి అమల్లోకి రానుందని సమాచారం. యూజర్ల ప్రైవసీకి భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే గూగుల్ ఈ చర్యలు చేపట్టింది. ఇకపై ప్లే స్టోర్‌లో రిమోట్ కాల్ ఆడియో రికార్డింగ్ వంటి యాప్స్ ను ఉపయోగించలేరు.
ఇది కూడా చదవండి: అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉన్నా.. పదివేలు విత్‌డ్రా చేయొచ్చు!
అయితే.. గూగుల్ డయలర్ లేదా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ డిఫాల్ట్‌గా ఇచ్చే డయలర్ ద్వారా మాత్రమే ఇకపై కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. కాగా, గూగుల్ డయలర్ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్ ఉపయోగిస్తుంటే అవతలి వ్యక్తికి కూడా ఈ కాల్ రికార్డు చేస్తున్నారనే అలర్ట్ వస్తుంది.