బంగారం, వెండి కొనాలని ఎదరుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్.. వెండిరేటు ఈ రోజు చాలా దిగొచ్చింది. కిలో వెండి రేటు ఏకంగా రూ.5,300 పడిపోయింది. బంగారం ధర కూడా ఎంతవరకు మార్పు చెందిందో తెలుసుకుందాం.
భారతదేశంలో బంగారం అంటే ప్రత్యేకమైన స్థానం నెలకొంది. ముఖ్యంగా ఆడవారు ధరించే బంగారు ఆభరణాలు రకరకాలుగా ఉంటాయి. బంగారు ఆభరణాల గురించి ఎంత చెప్పినా తనవి తీరదు. ఆడవారికి ఎంత బంగారం ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది. అవి ఆడవారి అలంకరణకు సంబంధించి అతి విలువైన ఆభరణాలు కాబట్టి. బంగారం చిన్న చిన్న వస్తువులైనా సరే ఆడవారు కొని బంగారం పోగు చేసుకుంటారు. చాలామంది బంగారంపై మక్కువ చూపుతారు. ఆపద కాలంలో బంగారం మనకు డబ్బులు సమకూర్చుకొనేందుకు అవసరమవుతుంది. సమాజంలో స్టేటస్ చూపించుకునేందుకు కూడా బంగారం ఆభరణాలను వేసుకుంటారు. బంగారాన్ని ఇష్టపడని వారుండరు.
ఈ రోజుల్లో మగవారు కూడా బంగారాన్ని ధరిస్తున్నారు. మెడలోని చైన్స్, చేతికి రింగ్స్, మణికట్టుకు బ్రాస్‌లేట్స్, చెవిపోగులు చాలా వెరైటీ డిజైన్లలో వేసుకుంటారు. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు చాలా పెరగడం ద్వారా బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు.సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. దీంతో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కోసారి రికార్డ్ స్థాయిలో గోల్ట్, వెండి ధరలు దూసుకెళ్తాయి. అయితే ఈ రోజు బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం..
ఇంటర్నేషనల్ మార్కెట్లలో చూసుకుంటే గోల్డ్, సిల్వర్ రేట్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్‌కు 1957 డాలర్ల వద్ద. స్పాట్ సిల్వర్ ధర 24.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్ కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూ. 81.938 వద్ద సేల్ అవుతోంది. ఈ మధ్య కాస్త పుంజుకుంటుంది. వెండి రేట్ల విషయానికి వస్తే.. కిలోపై ఏకంగా రూ. 5300 పడిపోయంది. ఇది వెండి కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. హైదరాబాద్‌లో సిల్వర్ రేటు కిలోపై రూ.5300 తగ్గిపోయింది. ప్రస్తుతం కిలో రేటు రూ. 73,500 మార్క్ వద్దకు దిగివచ్చింది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర స్థిరంగా రూ.73,500 కొనసాగుతుంది. సాధారణంగా వెండి ధరలు ఢిల్లీ, హైదరాబాద్ లలో చాలా తేడా కనబడేది. ఇవాళ మాత్రం రెండు ఒకే ధర పలుకుతున్నాయి. అయితే వెండి కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశమనిచెప్పాలి. హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం అంటే 10 గ్రాముల ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇప్పుడు రూ. 55,100 వద్ద ట్రేడవుతోంది.24 క్యారెట్లకు చెందిన ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 60,110 వద్ద ట్రేడవుతోంది.