అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర రోజు రోజుకు స్వల్పంగా దిగి వస్తుంది. దీనితో మన దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గనుంది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మార్కెట్లో రూ.60,000 లకు దిగివచ్చింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల వెండి రూ.7,860 వద్ద కొనసాగుతోంది.
మన దేశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. చాలా విలువైన వస్తువులుగా భావిస్తాం. అయితే ఈ బంగారం ఆడవారికి ఎంత తీసుకున్నా తనివి తీరదు. ఆభరణాల రూపంలో బంగారాన్ని చాలా రూపాలలో తయారు చేస్తారు. అయితే గోల్డ్ మనకు అన్ని విధాల పనికి వస్తుంది. అలంకరణ కోసం నగలు చేయించుకుంటారు. ఆడవారే కాకుండా మగవారు కూడా నగలపై మక్కువ చూపుతారు. బంగారాన్ని కలిగి ఉండడంతో మనిషిని సమాజంలో తమ స్థాయిని తెలియజేస్తుంది. అటువంటి గోల్డ్ రేట్లు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం.
పసిడి ప్రియులకు శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర రోజురోజుకు స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. నిన్న 1947.29 డాలర్ల వద్ద కొనసాగిన ఔన్సు స్పాట్ గోల్డ్ ఇవాళ 1,937.05 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దాదాపు 10 డాలర్లు పతనమైంది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలపై ప్రభావం పడింది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,070 ఉండగా ఇవాళ రూ. 70 తగ్గింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ.55,000 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ. 60,070 ఉండగా ఇవాళ రూ. 70 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60,000 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు పరిశీలించినట్లయితే.. నిన్న ఉదయం ఔన్స్ స్పాట్ వెండి 23.87 డాలర్ల వద్ద ఉండగా ఇవాళ ఉదయం 23.14 డాలర్ల వద్ద కొనసాగుతోంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో నిన్న 10 గ్రాముల ధర రూ. 790 ఉండగా ఈ రోజు 10 గ్రాముల వెండి ధర రూ. 786 వద్ద కొనసాగుతోంది. అంటే చాలా స్వల్పంగా రూ. 4 తగ్గింది. గత కొద్ది రోజులుగా గమనిస్తే వెండి ధరలు ఒక్కసారిగా పెరిగి మరల తగ్గినట్లు తెలుస్తుంది.
గమనిక: బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. కాబట్టి కొనే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందిగా మనవి